AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: రవీంద్ర జడేజా బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడా? వివరణ ఇచ్చిన బీసీసీఐ

మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ రెన్‌షా, పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌, టాడ్‌ మార్ఫే వంటి బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించాడు జడ్డూ . టెస్టుల్లో జడేజా పాంచ్‌ పటాకా కొట్టడం ఇది 11వ సారి.

IND vs AUS: రవీంద్ర జడేజా బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడా? వివరణ ఇచ్చిన బీసీసీఐ
Ravindra Jadeja
Basha Shek
|

Updated on: Feb 10, 2023 | 12:55 PM

Share

సుమారు ఐదు నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ రెన్‌షా, పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌, టాడ్‌ మార్ఫే వంటి బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. టెస్టుల్లో జడేజా పాంచ్‌ పటాకా కొట్టడం ఇది 11వ సారి. అయితే ఈ మ్యాచ్లో జడేజా చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ రెండో సెషన్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా తన వేలికి ఏదో అప్లై చేస్తున్న వీడియోను ఓ ఆస్ట్రేలియా నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జడేజా మహ్మద్ సిరాజ్ నుంచి ఏదో తీసుకుని ఎడమ వేలికి రాస్తూ కనిపించాడు. దీనిపై ఓ ఆస్ట్రేలియా అభిమాని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్‌ను ప్రశ్నించగా పైన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోకు ‘ఇంట్రెస్టింగ్‌’ అని రిప్లై ఇచ్చాడు. మరికొందరు జడేజా ఏమైనా చీటింగ్‌ చేశాడా? అని కామెంట్లు పెట్టారు. ఇక ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెట్ ఛానెల్ ఫాక్స్ క్రికెట్ కూడా దీని గురించి నివేదించింది. జడేజా బాల్‌ ట్యాంపరింగ్ చేస్తున్నాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు అల్లారు.

ఈక్రమంలో ఆటతో కాకుండా తప్పుడు కథనాలు, వార్తలతో టీమిండియా ఆటతీరును తక్కువ చేసేందుకు ఆస్ట్రేలియా మీడియా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జడేజాపై వస్తోన్న బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది. వేలి నొప్పిని తగ్గించే సాలువాఘీ ఆయింట్‌మెంట్‌ను మాత్రమే జడేజా తన వేలికి పూసినట్లు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. తద్వారా జడేజాపై వస్తోన్న బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలను కొట్టిపారేసింది. కాగా, ఐదేళ్ల క్రితం ఇదే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో క్రికెట్ ప్రపంచం ముందు తల దించుకున్నారు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, యువ బ్యాట్స్‌మెన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతిని ట్యాంపరింగ్‌ కెమెరాకు చిక్కారు. దీంతో ముగ్గురిపై ఏడాది పాటు క్రికెట్‌ నిషేధం విధించారు. వీరిలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ప్రస్తుతం భారత పర్యటనలో ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..