IND vs AUS: ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ .. గాయపడిన కీలక ప్లేయర్.. ఆస్పత్రికి తరలింపు
రెండో రోజు ఆటలో ఆ జట్టు కీలక ఆటగాడు రెన్‌షా గాయపడ్డాడు. మోకాలిలో హఠాత్తుగా నొప్పి మొదలవడంతో గ్రౌండ్ సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుత నివేదికల ప్రకారం మాథ్యూ రెన్‌షా మోకాలిలో తీవ్రమైన వాపు ఉందట.
నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాకు ఏదీ కలిసి రావడం లేదు. తొలి రోజు కంగారూ జట్టు కేవలం 177 పరుగులకే ఆలౌటైంది. వెటరన్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషెన్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఇక తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ భారీస్కోరు దిశగా దూసుకెళుతోంది. కాగా రెండో రోజు ఆటలో ఆ జట్టు కీలక ఆటగాడు రెన్‌షా గాయపడ్డాడు. మోకాలిలో హఠాత్తుగా నొప్పి మొదలవడంతో గ్రౌండ్ సిబ్బంది వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుత నివేదికల ప్రకారం మాథ్యూ రెన్‌షా మోకాలిలో తీవ్రమైన వాపు ఉందట. ఈ కారణంగా అతను ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు. రెన్‌షా స్థానంలో అష్టన్ అగర్ ఫీల్డింగ్‌కు దిగాడు. ఒకవేళ రెన్‌షా గాయం తీవ్రంగా అతను బ్యాటింగ్ కూడా చేయలేకపోవచ్చు. కాగా ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెన్‌షా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. జడేజా బౌలింగ్‌లో తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. కాగా ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, ఆస్టన్ ఆగర్‌లను కాదని రెన్‌షాను తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు అతను మొదటి బంతికే ఔట్ కావడం, ఆ తర్వాత మరింత ఒత్తిడి పెరిగి జట్టు మొత్తం 177 పరుగులకే కుప్పకూలిందంటూ ఆసీస్ మాజీ క్రికెటర్లు జట్టు ఎంపికపై మండి పడుతున్నారు.
రోహిత్ సెంచరీ.. ఆధిక్యంలోకి టీమిండియా..
కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. కడపటి వార్తలందే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (101) తో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ (23), ఛటేశ్వర్ పుజరా(7), విరాట్ కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. కొత్త స్పిన్నర్ టాడ్ మూర్పీ 4 వికెట్లు నేలకూల్చాడు.
Smiles, claps & appreciation all around! ? ?
This has been a fine knock! ? ?
Take a bow, captain @ImRo45 ??
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY
— BCCI (@BCCI) February 10, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..