Video: సెంచరీ బాదిన హిట్‌మ్యాన్.. ముగిసిన 2985 రోజుల వనవాసం.. తొలి భారత కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర..
Rohit Sharma Century: నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో 9వ సెంచరీ సాధించాడు.
India vs Australia: నాగ్‌పూర్ టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెంచరీ చేసిన వెంటనే రోహిత్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్, టీ20ఐ) సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. రోహిత్ కంటే ముందు బాబర్ ఆజం, దిల్షాన్, ఫాఫ్ డు ప్లెసిస్ ఈ ఘనత సాధించారు.
నాగ్‌పూర్ టెస్టు తొలిరోజు గురువారం ఆస్ట్రేలియా జట్టు 177 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. భారత్ తరపున మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం రోహిత్ సెంచరీ సాధించాడు. వార్తలు రాసే సమయానికి రోహిత్ 188 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ సెంచరీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడి కంటే ముందు ప్రపంచ క్రికెట్‌లో ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్, దిల్షాన్‌లు కూడా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో వార్తలు రాసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. టీమిండియా తరుపున రోహిత్‌తో పాటు రవీంద్ర జడేజా (27) క్రీజులో ఉన్నాడు.
ముగిసిన రోహిత్ ‘అజ్ఞాతవాసం’..
Smiles, claps & appreciation all around! ? ?
This has been a fine knock! ? ?
Take a bow, captain @ImRo45 ??
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY
— BCCI (@BCCI) February 10, 2023
రోహిత్ శర్మ డిసెంబర్ 9, 2014న ఆస్ట్రేలియాతో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను ఈ టీంపై 14 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ సెంచరీ చేయలేకపోయాడు. అయితే, 15వ టెస్టు ఇన్నింగ్స్‌లో అంటే 2985 రోజుల తర్వాత రోహిత్ సెంచరీ పూర్తి చేశాడు.
పిచ్ కాదు.. ఆడటంపైనే దృష్టి..
నాగ్‌పూర్ టెస్టు ప్రారంభానికి ముందు పిచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పిచ్‌పై ఆస్ట్రేలియా మీడియా ఎప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు పిచ్‌పై కాకుండా ఆటపై దృష్టి పెట్టాలని రోహిత్ శర్మ అతనికి సూచించాడు. బ్యాట్‌తో రోహిత్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అర్ధ సెంచరీ కూడా చేయలేని పిచ్‌పై రోహిత్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. సన్నద్ధత కంటే పిచ్‌ని ఎక్కువగా చూసే బ్యాట్స్‌మెన్‌లకు రోహిత్ ఈ సెంచరీ ఒక గుణపాఠంగా నిలిచింది.