AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s day 2023: ఇవి గిఫ్ట్స్ కాదు.. మీ ప్రేమకు ప్రతిరూపాలు.. మీ ప్రియుడికి ఇవ్వాలనుకుంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్

ప్రేమికులు, తన ప్రియురాలు, ప్రియుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ల ద్వారా వారిని సంతోషపెట్టాలని చాలా ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి వాలెంటైన్స్ డేని మించిన సందర్భం మరొకటి ఉండదు.

Valentine's day 2023: ఇవి గిఫ్ట్స్ కాదు.. మీ ప్రేమకు ప్రతిరూపాలు.. మీ ప్రియుడికి ఇవ్వాలనుకుంటే ఇవే బెస్ట్ ఆప్షన్స్
Valentines Day Gift
Madhu
|

Updated on: Feb 11, 2023 | 4:50 PM

Share

ప్రేమ.. రెండక్షరాలే కానీ దీనిని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు.. ఆస్వాదించడానికి జీవితం చాలదు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిపై మొదలవుతుందో చెప్పడం కష్టం. చాలా మంది ప్రేమలో పడతారు. ఆపై విడిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తమ ప్రేమను గెలిపించుకొని జీవితాంతం సుఖమయ జీవితాన్ని అనుభవిస్తారు. అయితే ప్రేమికులు, తన ప్రియురాలు, ప్రియుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ల ద్వారా వారిని సంతోషపెట్టాలని చాలా ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి వాలెంటైన్స్ డేని మించిన సందర్భం మరొకటి ఉండదు. అందుకనే ప్రేమికుల రోజు కోసం ప్రతి ప్రేమ జంట ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో త‌మ ప్రియులకు మంచి బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని కోరుకుంటారు. అవి గుర్తుండిపోయేలా చేయడానికి గొప్ప బహుమతులు కొనుగోలు చేయాల‌ని చూస్తారు. మీరు కూడా అలాంటి ఆలోచనలోనే ఉన్నారా? మీ ప్రియమైన వ్యక్తికి ఇవ్వదగిన బెస్ట్ గిఫ్ట్ సజెషన్స్ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం.

చేతి గడియారం: మీ ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వదగిన బెస్ట్ వన్ రిస్ట్ వాచ్. ప్రస్తుత మార్కెట్ లో అనేక రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ మోడల్, డిజైన్ వాచ్ ను సెలెక్ట్ చేసి వాలెంటైన్స్ డే రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే బావుటుంది. ప్రతి రోజూ దానిని చూసినప్పుడల్లా మీరు గుర్తుకువస్తారు.

స్నేక్ ప్లాంట్: స్నేక్ ప్లాంట్ అనేది తక్కువ కాంతి అవసరమయ్యే ఇండోర్ ప్లాంట్. దీని సంరక్షణ చాలా సులభమైనది. మీరు కలిసి ఇదే మొదటి వాలెంటైన్స్ డే అయితే, అతని పరిసరాలకు అందాన్ని తీసుకొచ్చే ఈ స్నేక్ మొక్క గిఫ్ట్ గా ఇవ్వడం మంచి ఆప్షన్.

ఇవి కూడా చదవండి

కాఫీ మగ్: మీ ప్రియుడు ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉంటే.. అతనికి మీరు మీ ఫోటో లేదా, మంచి సందేశంతో కూడిన స్టైలిష్ మగ్ ను గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. రోజు ప్రారంభమయ్యేది కాఫీతోనే కాబట్టి.. మీ గురించిన ఆలోచనే ప్రథమంగా ఉంటుంది.

బంగారు గొలుసు: మీ ప్రియుడు బంగారాన్ని ఇష్టపడే వ్యక్తి అయితే, అతనికి విలాసవంతమైన బ్రాండ్ ఎలివేటెడ్ చైన్ నెక్లెస్‌ని గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. అది అతని కి చాలా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. దానిని ధరించినప్పుడు కొంత మెరుపును ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

సైకిల్: మీ ప్రియుడు ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా? అతని ఆరోగ్యం పట్ల మీకు కూడా బాధ్యత ఉందా? అయితే మీకు బెస్ట్ ఆఫ్షన్ సైకిల్. అతనికి మంచి రోడ్ బైక్, మౌంటెన్ బైక్, హైబ్రిడ్ సైకిల్ ఏది కావాలో.. ఏది అవసరమో తెలుసుకొని బహుమతిగా ఇవ్వవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..