AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airplane Safest Seat: విమానంలో ఆ సీటులో మాత్రం కూర్చోవద్దంటున్న నిపుణులు.. మరి సురక్షితమైన సీటు ఏదో తెలుసా?

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్న పరిస్థితుల్లో అసలు విమానాల్లో ఏ సీటు భద్రమో అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని విమానయాన నిపుణులను అడిగితే వారు చెబుతున్న విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Airplane Safest Seat: విమానంలో ఆ సీటులో మాత్రం కూర్చోవద్దంటున్న నిపుణులు.. మరి సురక్షితమైన సీటు ఏదో తెలుసా?
Airplane Seat
Madhu
|

Updated on: Feb 11, 2023 | 2:15 PM

Share

విండో సీట్.. చాలా హాట్ సీట్.. ఏ రిజర్వేషన్ అయినా మొదట ఫిల్ అయ్యేది ఈ సీటే. అది బస్సైనా.. రైలైనా.. విమానమైనా.. విండో సీటుకే తొలి ప్రధాన్యం ఉంటుంది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలివారి వరకూ అందరూ దానికే ప్రధాన్యం ఇస్తారు. కారైనా ఇదే పరిస్థితి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. భద్రత గురించి పెద్దగా ఆలోచించరు. అయితే ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగినప్పుడు ఈ విండో సీటులో కూర్చున్న వారే మొదటిగా ప్రభావితులవుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏ సీటులో కూర్చుంటే సేఫ్ అనే చర్చ నడుస్తోంది.

విమాన ప్రయాణాల్లో..

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్న పరిస్థితుల్లో అసలు విమానాల్లో ఏ సీటు భద్రమో అని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని విమానయాన నిపుణులను అడిగితే వారు చెబుతున్న విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విండో సీటు అత్యంత ప్రమాదరకమైతే.. మరే సీటులో కూర్చుంటే ప్రమాద ప్రభావాన్ని తగ్గిచుకోవచ్చో ఓ సారి చూద్దాం..

ఆ సీటే సురక్షితం..

విమానంలో ప్రయాణించేటప్పుడు కూడా చాలా మంది ప్రయాణికులు విండో సీటుకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. మేఘాలలో ప్రయాణిస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చని ఆలోచిస్తుంటారు. అయితే ఆ విండో సీటే అత్యంత ప్రమాదకరమైనదని ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి చెందిన విమానయాన నిపుణుడు ప్రొఫెసర్ డౌగ్ డ్రూరీ చెబుతున్నారు. ఆయన చేసిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసియాని వివరించారు. విమాన ప్రారంభంలో ఉండే సీటు(ఏఐఎస్ఎల్ఈ)తో పొలిస్తే మధ్య ఉండే సీటు అత్యంత సురక్షితమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎమర్జెన్సీ డోర్ కు దగ్గరలో ఉన్న సీటు కూడా సురక్షితమేనని వెల్లడించారు. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ సీటుకు దగ్గరలో ఉన్నవారు త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే మధ్య ఉన్న సీట్లన్నీ సురక్షితం కాదని పేర్కొన్నారు. విమాన రెక్కల్లో ఇంధనం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆ వరుసలో ఉండే సీట్లపై ముందు ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే వెనుక వరుసల్లోని మధ్య సీట్లతో పోలిస్తే ముందు వరుసల్లోని మధ్య సీట్లు సురక్షితం కాదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా విమానంలో మధ్య సీటుతోపాటు ఎమర్జెన్సీ డోర్ కు దగ్గర ఉన్న సీట్లు మాత్రమే అన్నివిధలా సురక్షితమని అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రతి విమాన ప్రయాణికులు తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..