Google Bard: ఆ రెండూ తొందరపాటు నిర్ణయాలే.. సుందర్ పిచాయ్‌ని ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు
ప్రస్తుతం టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీని లాంచ్ చేసిందో ఒక్కసారిగా టెక్ ప్రపంచం షేక్ అయ్యింది. టెస్టింగ్ స్టేజ్‌లో చాట్ జీపీటీ వండర్స్ క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో బింగ్ సెర్చ్ ఇంజన్‌తో చాట్...
ప్రస్తుతం టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీని లాంచ్ చేసిందో ఒక్కసారిగా టెక్ ప్రపంచం షేక్ అయ్యింది. టెస్టింగ్ స్టేజ్‌లో చాట్ జీపీటీ వండర్స్ క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో బింగ్ సెర్చ్ ఇంజన్‌తో చాట్ జీపీటీని కంబైండ్ చేయడం ద్వారా సెర్చ్ ఇంజన్‌లో ఎదురులేని శక్తిగా ఎదగాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీంతో ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. చాట్ జీపీటీ నుంచి తమకు పోటీ తప్పదనుకున్న కంపెనీ వెంటనే బార్డ్ పేరుతో కొత్త చాట్‌బోట్‌ను రూపొందించింది.
అయితే కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో గూగుల్ కాస్త తొందరపడింది. పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకుండానే బార్డ్ డెమోను విడుదల చేసింది. అయితే ఈ డెమోలో దొర్లిన తప్పు గూగుల్ కొంపముంచింది. జేమ్స్ వెబ్‌స్పేస్ టెలిస్కోప్ డిస్కవరీపై తొమ్మిదేండ్ల బాలుడు అడిగిన ప్రశ్నకు బార్డ్ పొరపాటు జవాబు చెప్పింది. సౌర వ్యవస్థకు బయట ఉన్న గ్రహాల చిత్రాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిందని బార్డ్ చెప్పిన సమాధానం. కానీ ఇది తప్పు. 2004లోనే యూరోపియన్ యూనియన్ సదరన్ టెలిస్కోప్.. సూర్యుడికి వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను చిత్రీకరించింది. దీంతో గూగుల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎంతలా అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ. 8.25 లక్షల కోట్లు.
సొంత ఉద్యోగుల నుంచే వ్యతిరేకత..
ఇదిలా ఈ తప్పిదంతో అటు ఖగోళ శాస్త్రవేత్తలు విమర్శలు ఎదుర్కున్న గూగుల్ సొంత ఉద్యోగుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటోంది. కొందరు ఉద్యోగులు ఏకంగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, బార్డ్ చాట్ బోట్ విడుదల చేయడం రెండూ.. తొందరపాటు నిర్ణయాలే అంటూ బహిరంగానే విమర్శనస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే గూగుల్ ఇంటర్నల్ ఫోరమ్‌లో సైతం ఉద్యోగులు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..