Oppo Reno 8T: ఫ్లిప్‌కార్ట్‌లో అప్పొ రెనో 8టి సేల్స్ షురూ.. అదిరిపోయే ఎక్స్చేంజ్ ఆఫర్..

అప్పొ గత వారం రెనో 8టి 5 జీ ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అప్పో స్టోర్స్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ డిజైన్ స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.

Oppo Reno 8T: ఫ్లిప్‌కార్ట్‌లో అప్పొ రెనో 8టి సేల్స్ షురూ.. అదిరిపోయే ఎక్స్చేంజ్ ఆఫర్..
Oppo Reno 8t
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Feb 11, 2023 | 3:43 PM

భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని దృషిలో పెట్టుకుని వివిధ కంపెనీలు ఇక్కడ కొత్త మోడల్స్ అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అప్పొ గత వారం రెనో 8టి 5 జీ ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అప్పో స్టోర్స్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ డిజైన్ స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. అప్పో రెనో 8 టి ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరింయట్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.29,999గా నిర్ణయించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అదనం రూ.2999 ఎక్స్చేంచ్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు కార్డులతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ని ఆఫర్లు వచ్చే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి తెలుసుకుందాం. 

అప్పో రెనో 8టి స్పెసిఫికేషన్లు ఇవే..

  • 6.7 అంగుళాలా డ్రాగన్ టైల్ స్మార్ట్ 2 ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే
  • 108 ఎంపీ బ్యాక్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 40x మైక్రోలెన్స్ ఫీచర్లు
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, బొకే ఫ్లేర్ పోర్ట్రెయిట్, వ్లాగింగ్ కోసం డ్యుయల్ వ్యూ వీడియో వంటి అధునాతన ఫీచర్లు
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, ఎస్ఓసీ చిప్‌సెట్
  • 1 టీబీ వరకూ మెమరీ విస్తరించే అవకాశం

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..