- Telugu News Photo Gallery Chewing betel leaf is very harmful and can be a for these health problems check here for more details
Betel Leaf Side Effects: తమలపాకులతో నోటి క్యాన్సర్.. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు.. తెలిస్తే మళ్లీ పట్టుకోరు కూడా..
మీరు తమలపాకులను తింటారా..? పోనీ కిళ్లీ అలవాటు ఉందా..? ఉంటే మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివి. తమలపాకు వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ పరిమితికి మించి తమలపాకు లేదా తమలపాకు ఉపయోగించి చేసే కిళ్లీలు మీ ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
Updated on: Feb 11, 2023 | 10:39 AM

ఎన్నో రకాల పోషకాలు ఉన్న తమలపాకు మన ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉంటుంది. అయితే ఈ ఆకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తీవ్ర దుష్ర్పభావాలకు కారణమవుతుంది. మరి తమలపాకు వల్ల కలిగే దుష్ర్పభావాలేమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం..

1. అలెర్జీ: తమలపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ అలెర్జీ సమస్య వస్తుంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రగా మారుతుంటాయి.

2. చిగుళ్లలో నొప్పి: తమలపాకును ఎక్కువగా తినడం వల్ల చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇంకా తీవ్రమైన నొప్పితో పాటు.. చిగుళ్ళు, దవడలలో వాపు వచ్చి.. నొప్పి కలుగుతుంది.

3. హై బీపీ: తమలపాకులు ఎక్కువగా తింటే హైబీపీ సమస్య వస్తుంది. ఇది అధిక రక్తపోటు, అసాధారణ హృదయ స్పందనలకు దారితీస్తుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది.

4. హార్మోన్ల అసమతుల్యత: పాన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తమలపాకులను ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది.

5. ప్రెగ్నెన్సీ సమస్యలు: తమలపాకులను ఎక్కువగా తినడం వల్ల గర్భధారణపై ప్రభావం పడుతుంది. ఇది గర్భంలో పిండం, దాని అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇది పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

6. ఓరల్ క్యాన్సర్: తమలపాకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మార్కెట్‌లో దొరికే పాన్‌లో కూడా పొగాకు ఉంటుంది. ఇది హానికరమైనది కావడంతో నోటి క్యాన్సర్ సమస్యకు అవకాశం ఉంది.





























