Toothache Remedies: పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు వేధిస్తున్నాయా..? ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే తక్షణ ఉపశమనం ఖాయం..
చలికాలంలో మనల్ని వేధించేవి దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లే కాదు. వీటితో పాటు నిత్యం ఇబ్బందిపెట్టే మరో సమస్య పంటితీపులు లేదా పంటి నొప్పులు..
లవంగం నూనె: లవంగం నూనెలో మత్తుమందు, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. ఇది పంటి నొప్పికి సమర్థవంతమైన ఇంటి నివారణ. కొన్ని చుక్కల లవంగం నూనెను దూదిపై రాసి నొప్పిగా ఉన్న పంటిపై 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచితే పంటి నొప్పి తగ్గుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి, అందులో కొంచెం ఉప్పు కలిపి నొప్పిగా ఉన్న పంటిపై రాయండి.
పిప్పరమింట్ టీ బ్యాగ్స్: పిప్పరమెంటు శీతలీకరణ అనుభూతి పంటి నొప్పి, వాపును తగ్గిస్తుంది. అందుకోసం పిప్పరమింట్ బ్యాగ్‌ను నొప్పి ఉన్న పంటిపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్: హైడ్రోజన్ పెరాక్సైడ్ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి, వాపును తగ్గించడానికి ఉపకరిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమాన భాగాలుగా కలపి.. వాటితో మీ నోటిని 30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోండి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..