Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: 30 ఏళ్లు పైబడిన వారు ఈ నాలుగు పదార్థాలు తీసుకుంటే.. వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉంటారు..!

ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహార ఆహారం చాలా ముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో ప్రజలు 30 ఏళ్లు పైబడగానే ముసలి వాళ్ల మాదిరిగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

Health Tips: 30 ఏళ్లు పైబడిన వారు ఈ నాలుగు పదార్థాలు తీసుకుంటే.. వృద్ధాప్యంలోనూ ఫిట్‌గా ఉంటారు..!
Women And Men
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 12, 2023 | 6:56 AM

ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహార ఆహారం చాలా ముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో ప్రజలు 30 ఏళ్లు పైబడగానే ముసలి వాళ్ల మాదిరిగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, తప్పుడు జీవనశైలి. పోషకాహార లోపం వల్ల చిన్న వయసులోనే రోగనిరోధక శక్తి బలహీనపడటం, కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం, గుండె జబ్బులు వంటివి వస్తున్నాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి వయస్సులోనూ పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన యువత.. మహిళలు, పురుషులు తమ ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉంటారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. ఇందుకోసం 30 ఏళ్లు పైబడిన వారు నాలుగు పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సోయాబీన్స్..

సోయాబీన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే సోయాబీన్ తీసుకోవాలి. సోయాబీన్‌లో ఉండే పోషకాలు ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. 100 గ్రాముల సోయాబీన్‌లో 36.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ప్రొటీన్‌ లోపం ఉన్నవారు సోయాబీన్‌ తీసుకోవాలి. రోజూ ఒకసారి సోయాబీన్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి మేలు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

బ్రకోలీ..

బ్రకోలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రకోలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రకోలీ ప్రొటీన్ లోపాన్ని కూడా తీరుస్తుంది. ఇందులో 4.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. బ్రకోలీ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. దీనితో పాటు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. బ్రకోలీని క్రమం తప్పకుండా తీసుకుంటే వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది.

పచ్చి బఠానీలు..

ఆకు కూరల్లో ప్రొటీన్స్, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆకు కూరల్లో బచ్చలికూర, సోయా మెంతులు మొదలైనవి ఉంటాయి. కానీ పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల ఆకు కూరల్లో కంటే ఎక్కువ ప్రొటీన్లు లభిస్తాయి. బఠానీలలో 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతే కాదు.. బఠానీలు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పరస్ మొదలైన వాటి లోపాన్ని కూడా తీరుస్తాయి. పచ్చి బఠానీలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చేపలు..

మీరు మాంసాహారులైతే చేపలను తీసుకోవడం మేలు. చేపలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల చేపలో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో అవసరమైన హార్మోన్లను చేస్తుంది. చేపల వినియోగం గుండె, మెదడు ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: పైన ఇవ్వబడిన సమాచారం వైద్య, ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వడం జరిగింది. అయితే, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ముందుగా వైద్యులను సంప్రదించిన తరువాత, వారి సూచనల మేరకు ఆహారాలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..