AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: సోషల్ మీడియాను వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది!

Social Media: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా సోషల్ మీడియాను యూజ్ చేయకుండా ఉండలేరనేది కూడా పచ్చి నిజం.

Social Media: సోషల్ మీడియాను వాడేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది!
Social Media
Shiva Prajapati
|

Updated on: Feb 11, 2023 | 9:24 AM

Share

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులంతా సోషల్ మీడియాను యూజ్ చేయకుండా ఉండలేరనేది కూడా పచ్చి నిజం. యావత్ ప్రపంచాన్ని ఓకుగ్రామంగా మార్చేసింది సోషల్ మీడియా. ప్రపంచం మారుమూలన సైతం ఏం జరిగినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే, ఈ సోషల్ మీడియా వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అట్టాంటిట్టాంటి దుష్ప్రభావాలు కాదు.. తేడా కొడితే జైల్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది.

అవును, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని నియమాలు కూడా తెలుసుకోవడం తప్పనిసరి. ఈ నియమాలు తెలియక ఏదైనా తప్పు చేస్తే నేరంగా పరిగణించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా అనుచిత కార్యకలాపాలు చేస్తే.. అది నేరం పరిధిలోకి రావచ్చు. అంతేకాదు.. ఇలా చేసినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. అందుకే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నియామల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

చైల్ పోర్నోగ్రఫీ..

సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన చట్టం చాలా కఠినంగా ఉంటుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మీ కంట పడితే.. వాటిని అస్సలు చూడొద్దు. అంతేకాదు.. దానికి సంబంధించి ఎలాంటి సెర్చింగ్ చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఒకవేళ అలా సెర్చ్ చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫేక్ న్యూస్ ప్రచారం..

తప్పుడు వార్తలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు ఏదైనా ఫేక్ న్యూస్ మీకు కనిపిస్తే.. దానిని షేర్ చేయకూడదు. తప్పుడు వార్తలను షేర్ చేస్తే మీపై కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా వార్తలను షేర్ చేసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి.

అభ్యంతరకరమైన వీడియో..

పొరపాటున కూడా అభ్యంతకరమైన వీడియోలను షేర్ చేయకూడదు. అది నేరంగా పరిగణిస్తారు. అభ్యంతరకర వీడియోలను షేర్ చేయడం చట్టరిత్యా నేరం. ద్వేషం, వివక్ష, రెచ్చగొట్టే వీడియోలను అస్సలు షేర్ చేయొద్దు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్