Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Saving Tips: మీ వంట గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది..

కొన్నేళ్ల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు వాడేవారు. క్రమంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం గ్యాస్ స్టవ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకేముందు..

Gas Saving Tips: మీ వంట గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఇలా చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది..
Lpg Gas
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 11, 2023 | 9:31 AM

కొన్నేళ్ల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు వాడేవారు. క్రమంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం గ్యాస్ స్టవ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకేముందు.. ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్ప.. కట్టెల పొయ్యి అనే ముచ్చటే లేదు. అదే నగరాల్లో అయితే ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్పనిసరి. దాదాపు అన్ని ఇళ్లలో కనిపిస్తుంది. వంటగ్యాస్ ప్రవేశంతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ప్రజలు గ్యాస్‌పై తమ అనేక పనులను సౌలభ్యంతో చేస్తారు. అయితే, గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. మరి త్వరగా అయిపోయే వంట గ్యాస్ ఎక్కువ కాలం ఉండేలా ఏం చేయాలో ఇవాళ మేం మీకు చెబుతాం. ఆ టిప్స్ ఏంటో చూసేయండి మరి.

ఇలా చేస్తే వంట గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది..

1. చాలామంది సామాన్లు కడిగి నేరుగా గ్యాస్ స్టవ్ మీద పెట్టి వంట చేస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయకూడదు. ఎందుకంటే.. అప్పటికే పాత్ర తడిగా ఉంటుంది. అది ఆరడానికి మంట ఎక్కువ అవసరం అవుతుంది. దానికి బదులుగా ఆరిన పాత్రనే పొయ్యిపై పెడితే గ్యాస్ కాస్త సేవ్ అవుతుంది.

2. మీరు గ్యాస్‌పై వంట చేయాలనుకుంటే.. ముందుగా అవసరమైన వస్తువులన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఆ తరువాత మాత్రమే గ్యాస్ స్టవ్ వెలిగించాలి. చాలా మంది మొదట పాత్రలను గ్యాస్ స్టవ్‌పై ఉంచి, ఆ తరువాత ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి మొదలైన కూరగాయలను కట్ చేస్తారు. దీంతో చాలా గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి ఇలా చేయడం మానుకోండి.

ఇవి కూడా చదవండి

3. గ్యాస్ ఎక్కువ కాలం రావాలంటే ముందుగా గ్యాస్ సిలిండర్ లీకేజీని చెక్ చేయాలి. మనం గమనించం కానీ, గ్యాస్ సిలిండర్ నెమ్మదిగా లీక్ అవుతూనే ఉంటుంది. దీని కారణంగా కూడా గ్యాస్ త్వరగా ముగుస్తుంది. గ్యాస్ సిలిండర్ నుంచి గానీ, పైపు నుంచి కానీ లీక్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా గ్యాస్ త్వరగా అయిపోతుంది. అందుకే గ్యాస్ పైపును కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు.

4. మీడియం మంట మీద ఆహారాన్ని వండుకోవడం ఉత్తమం. చాలా మంది గ్యాస్ ను హై లో పెట్టి, వంటపాత్రపై మూత పెట్టకుండా వంట చేస్తారు. అలా చేయడం వల్ల గ్యాస్ త్వరగా పూర్తవుతుంది. గ్యాస్ ఆదా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీడియం మంట మీద వంట చేసుకోవాలి. అలాగే వండే సమయంలో పాత్రలపై మూత తప్పనిసరిగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ చాలా ఆదా అవుతుంది.

ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..