AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women: అస్సలు మొహమాటం వద్దు.. ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే నష్టం తప్పదు..

చాలా మంది మహిళలు కొన్ని కారణాల వల్ల తమ లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడరు. ఇది ఇబ్బంది, అసౌకర్యాన్ని మరింత పెంచుతుంది. అదే సమయంలో.. కొంతమందికి తాము లైంగిక ఆరోగ్యానికి ..

Women: అస్సలు మొహమాటం వద్దు.. ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే నష్టం తప్పదు..
Women Health
Shiva Prajapati
|

Updated on: Feb 12, 2023 | 8:00 AM

Share

చాలా మంది మహిళలు కొన్ని కారణాల వల్ల తమ లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడరు. ఇది ఇబ్బంది, అసౌకర్యాన్ని మరింత పెంచుతుంది. అదే సమయంలో.. కొంతమందికి తాము లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నామని కూడా తెలియదు. అలాగే, ఈ సమస్యకు ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి చాలా తక్కువ సమాచారం కలిగి ఉంటారు. ఈ పరిస్థితి మహిళలకు చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు. లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. STI, జనానంగం ద్వారం వద్ద పండ్లు వంటి లైంగిక సంపర్కం వలన కలిగే సమస్యలు చాలా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. స్త్రీలను ప్రభావితం చేసే అనేక రకాల STI లు ఉన్నాయి. ఇందులో క్లామిడియా, గనేరియా మొదలైనవి చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2. లైంగిక బలహీనత సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. స్త్రీలలో లైంగిక బలహీనతతో సంబంధం ఉన్న సమస్యలలో ఉద్రేకం, ఉద్వేగం, యోని పొడిబారడం, లిబిడో సమస్యలు ఉన్నాయి.

3. ప్రణాళిక లేని గర్భం చాలా మంది మహిళలకు ఒత్తిడి, ఆందోళనకు కారణం కావచ్చు. ఈ సమయంలో చాలా మంది మహిళలు అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాత్రలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. గర్భస్రావం తరువాత.. స్త్రీ శారీరకంగా, మానసికంగా తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి.

4. సమర్థవంతమైన గర్భనిరోధకాన్ని ఉపయోగించడం వలన ప్రణాళిక లేని గర్భధారణను నివారించవచ్చు. అలాగే, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గర్భనిరోధకం కోసం ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు, ప్రసవానంతర గర్భనిరోధకాలు ఉన్నాయి.

5. ఈ విషయాలన్నింటిపై మహిళలు అవగాహ కలిగి ఉండటం అవశ్యకం. తద్వారా లైంగికపరమైన విషయాల్లో తమను తాము రక్షించుకోవడానికి వీలుంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..