Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలలో నేటి నుంచి మార్చి 1 వరకు ఆ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలికంగా కొద్దిరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలలో నేటి నుంచి మార్చి 1 వరకు ఆ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Indian Railways
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 12, 2023 | 11:30 AM

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలికంగా కొద్దిరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది. నిన్న(ఫిబ్రవరి 11) రైల్వేస్ చేసిన ప్రకటన ప్రకారం.. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల పాక్షికంగా కొన్ని రైళ్లను రద్దయ్యాయి. ఇంకా ఆ ప్రకటనలో మునుమాక-శావల్యాపురం-సంతమాగులూరు మధ్య నాన్ ఇంటర్ లింకింగ్ పనులు జరుగుతున్నాయని, దాని కారణంగా నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రద్దు చేసిన ట్రైన్ల వివరాలను కూడా తన ప్రకటనలో పొందుపర్చింది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ట్రైన్లతో పాటు కాచికూడ, మెదక్ మధ్య తిరిగే రైళ్లు కూడా ఈ ప్రకటనలో ఉన్నాయి.

ఈ మరమ్మతు పనుల నేపథ్యంలో.. గుంటూరు (Guntur)-కాచిగూడ (17251) రైలును నేటి నుంచి ఈ నెల 28 వరకు, కాచిగూడ-గుంటూరు (17252) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అలాగే, కాచిగూడ-మెదక్ (Medak) (07577) రైలును రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు, మెదక్-కాచిగూడ (07578) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్టున్నట్టు తెలిపింది. వీటితోపాటు మచిలీపట్టణం-కర్నూలు సిటీ (07067) రైలును 14, 16,18, 21, 23 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ-మచిలీపట్టణం (07068) రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి 1 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.త

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాలలో తాత్కలికంగా రద్దైన ట్రైన్స్ వివరాలు.. 

అలాగే గుంటూరు-సికింద్రాబాద్ (17254) ఎక్స్‌ప్రెస్ రైలును దొనకొండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు (17254) ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ-గుంటూరు మధ్య ఈ నెల 18 నుంచి 27 వరకు రద్దు చేశారు. గుంటూరు-డోన్(17228) రైలును 12-28, డోన్-గుంటూరు (17227) రైలును 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) 19 నుంచి 28 వరకు, తిరుపతి-గుంటూరు (17262) రైలు గుంటూరు-మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!