CM KCR: 14న కొండగట్టుకు వెళ్ళనున్న కేసీఆర్.. అద్భుత క్షేత్రంగా మారనున్న ఆంజన్న ఆలయం.. పూర్తి వివరాలివే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టును మరో..

CM KCR: 14న కొండగట్టుకు వెళ్ళనున్న కేసీఆర్.. అద్భుత క్షేత్రంగా మారనున్న ఆంజన్న ఆలయం.. పూర్తి వివరాలివే..
Cm Kcr To Visit Kondagattu
Follow us

|

Updated on: Feb 12, 2023 | 8:04 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు. కొండగట్టును మరో యాదాద్రి చేయాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఇటీవల రూ.100 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు పాలకులు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ 14న ఆలయానికి చేరుకుని అంజన్న క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులతో చర్చిస్తారు. అనంతరం పూర్తి వివరాలు ప్రకటిస్తారు. అయితే ఘాట్ రోడ్‌తో పాటు వసతి గదులపై కూడా దృష్టి పెట్టనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే నిరంతర తాగు నీటి సరఫరా, అనుబంధ ఆలయాల అభివృద్ధి, పార్కింగ్ వంటి పలు రకాల సదుపాయలను సైతం మెరుగుపరచనున్నారు.

అంతేకాకుండా ఆలయ క్షేత్ర పరిధిలో ఉండే కోతుల ఆహారం కోసం ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి ఈ రోజు (ఫిబ్రవరి 12, ఆదివారం) కొండగట్టు క్షేత్రానికి వెళ్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆయన రూపొందించనున్నారు.  సీఎం కేసీఆర్‌ సంకల్పంతో కొండగట్టు అంజన్న ఆలయం యాదాద్రితరహాలో అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ శాభావం వ్యక్తం చేశారు.

త్వరలో లాల్‌ దర్వాజ ఆలయ పనులు..

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌‌లోని ప్రసిద్ధ లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గతేడాది అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ చేపడతామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు అక్కడ రానున్న 10 రోజుల్లో భూమిపూజ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం శాసనసభలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆలయ అభివృద్ధిపై  మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే బలాలతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘లాల్‌ దర్వాజ ఆలయ విస్తరణకు 1100 గజాల స్థలం గుర్తించాం. ఆ భూముల యజమానులకు పరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌ రూ.8.95 కోట్లు మంజూరు చేశారు. కంచన్‌బాగ్‌, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణాలకు రూ.19 కోట్లు ఇచ్చారు’’ అని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..