- Telugu News Photo Gallery Business photos Follow these instructions and Tech Tips while using ATM Machine else your account will be empty by hackers
ATM Alerts: ఏటీఎం వాడుతున్నారా..? జాగ్రత్త.. ఈ సూచనలను పాటించకపోతే మోసపోవడం ఖాయం..
ATM Alerts: ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ లావాదేవీలలోనే జరిగేవి ఇలాంటి మోసాలు. అయితే ఇప్పుడు వాటితో పాటు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎం కూడా సురక్షితం కాని పరిస్థితిగా మారింది.
Updated on: Feb 12, 2023 | 8:15 AM

ATM Alerts: ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ లావాదేవీలలోనే జరిగేవి ఇలాంటి మోసాలు. అయితే ఇప్పుడు వాటితో పాటు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎం కూడా సురక్షితం కాని పరిస్థితిగా మారింది.

ఏటీఎం నగదు విత్‌డ్రా ఎంత సులభమో..అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అందువల్ల ఏటీఎం నుంచి మీరు డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మోసపోకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక దారి. అందుకోసం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే..

ATM

కార్డు స్లాట్‌లో ఏటీఎంను అమర్చేటప్పుడు అందులో వెలిగే లైట్‌పై దృష్టి పెట్టండి. ఒకవేళ స్లాట్‌లో గ్రీన్ లైట్ ఉంటే..ఏటీఎం సురక్షితమని అర్ధం. కానీ అందులో రెడ్ లేదా మరే ఇతర లైట్ లేకపోతే ఏటీఎం సురక్షితం కాదని అర్ధం.

ఏటీఎం కోసం వెళ్లినప్పుడు.. ఏటీఎం మిషన్ కార్డు స్లాట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. కార్డు స్లాట్‌లో ఏదైనా సమస్య ఉందని లేదా తేడాగా ఉందని అన్పిస్తే.. ఆ స్లాట్ వాడకపోవడం మంచిది.

ATM Alerts: ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ లావాదేవీలలోనే జరిగేవి ఇలాంటి మోసాలు. అయితే ఇప్పుడు వాటితో పాటు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏటీఎం కూడా సురక్షితం కాని పరిస్థితిగా మారింది.

హ్యాకర్లు ఏ కస్టమర్ వివరాలైనా ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టే స్లాట్ నుంచి దొంగిలించే పరిస్థితి, ప్రమాదం ఉంది. ఏటీఎం మెషీన్ కార్డ్ స్లాట్‌లో హ్యాకర్లు రహస్యంగా అమర్చే డివైస్ మీ కార్డు వివరాల్ని స్కాన్ చేస్తుంది. ఆ తరువాత బ్లూ టూత్ లేదా ఇతర వైర్‌లెస్ డివైస్‌తో డేటా దొంగిలిస్తుంది.

కొద్దిపాటి అప్రమత్తత జరగరాని ఘటన నుంచి కాపాడుతుంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేముందు అది ఎంతవరకూ సురక్షితమో పరిశీలించడం అవసరం. ఏటీఎంలో అన్నింటికంటే ఎక్కువ రిస్క్ ఉండేది ఏటీఎం కార్డు క్లౌనింగ్‌తోనే.