- Telugu News Telangana Hyderabad Formula e 2023 jean eric vergne number 1 place at india 1st e prix race in hyderabad Anurag Thaku
Formula E Hyderabad: తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. తొలిసారైనా.. ఏర్పాట్లు అద్భుతం: రేసింగ్ విజేతలు..
ఫార్ములా ఈ రేస్ భారతదేశంలో మొదటిసారి నిర్వహించారు. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి టీంలు పాల్గొన్నాయి. ఈ రేస్‌లో జీన్ ఎరిక్ విజేతగా నిలిచాడు.
Updated on: Feb 12, 2023 | 12:33 PM

శనివారం హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌లో వెటరన్ డిఎస్ పెన్స్కే డ్రైవర్ జీన్-ఎరిక్ వెర్గ్నే విజయం సాధించాడు. ఫార్ములా ఈ రేసు భారతదేశంలో తొలిసారి నిర్వహించారు.

33-ల్యాప్‌ల ఎలక్ట్రిఫైయింగ్ రేసులో విజేతగా నిలిచిన జిన్ ఎరిక్, నిక్ కాసిడీ నుంచి కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. అయితే చివరికి అతన్ని అడ్డుకోగలిగాడు. వెర్గ్నే ముగింపు లైన్‌కు చేరుకున్నప్పుడు, అతని కారులో 0.5% శక్తి మాత్రమే మిగిలి ఉండడం గమనార్హం.

పోర్షేకు చెందిన ఆంటోనియో ఫెలిక్స్ డా కోస్టా మూడో స్థానంలో నిలిచాడు. అతను సెబాస్టియన్ బీమీపై విధించిన 17 సెకన్ల పెనాల్టీ ప్రయోజనాన్ని పొందాడు. మహీంద్రా రేసింగ్, దాని మొదటి హోమ్ రేస్‌లో పాల్గొంది. ఆలివర్ రోలాండ్ ద్వారా పాయింట్ సాధించింది. పదో స్థానంలో నిలిచాడు.

విజయం తర్వాత వెర్గ్నే మాట్లాడుతూ, 'నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా టీమ్‌ని చూసి గర్వపడుతున్నాను. మాకు మంచి కారు ఉంది. ఇది బహుశా ప్రస్తుతానికి ఉత్తమమైనది కాదు. కానీ, మేం ఈసారి మరింత శక్తివంతంగా తిరిగి వస్తాం' అంటూ ప్రకటించాడు.

ఈ రేసును నిర్వహించడం నిర్వాహకులకు అంత సులభం కాదు. వారికి చాలా తక్కువ సమయం ఉంది. గతేడాది నవంబర్‌లోనే హైదరాబాద్‌లో ఈ-రేస్‌ను నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, నిర్వాహకులు బాగా కృషి చేశారని తెలిపాడు.





























