Telangana Secretariat: కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు? మూడు రాష్ట్రాల ముఖ్య నేతలకు ఆహ్వానం

తెలంగాణ నూతన సచివాలయానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

Telangana Secretariat: కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు? మూడు రాష్ట్రాల ముఖ్య నేతలకు ఆహ్వానం
Telangana Secretariat
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2023 | 5:57 AM

తెలంగాణ నూతన సచివాలయానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సచివాలయ భవనాన్ని ఏప్రిల్‌ 14 డా. బీఆర్ అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా పూజలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకనుగుణంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. 6 వ అంతస్తును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ముందుగా భావించగా, శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి అది వాయిదా పడింది. మరో ముహూర్తం కోసం సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయన జయంతి రోజే దాన్ని ప్రారంభించాలని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం.

అయితే 2022 దసరా, 2023 సంక్రాంతి ముహూర్తాలు అనుకున్నా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధం కాగా, చివరి ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా వాయిదా పడింది.

ఇక తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌లతో పాటు బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, జేడీయూ జాతీయ నేత అలన్‌సింగ్‌తో పాటు, అంబేద్కర్‌ మనుమడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ను నూతన సచివాలయప్రారంభానికి ప్రభుత్వం ఆహ్వానించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి