CBSE Exam Guidelines: చాట్ జీపీటీని నిషేధించిన సీబీఎస్ఈ బోర్డు.. కారణమిదే..

సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షకు వచ్చే విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలలోకి తీసుకురావడానికి వీల్లేదని సీబీఎస్ఈ బోర్డు కంట్రోలర్ సాన్యం భారద్వాజ్ చెప్పారు.

CBSE Exam Guidelines: చాట్ జీపీటీని నిషేధించిన సీబీఎస్ఈ బోర్డు.. కారణమిదే..
Exams
Follow us

|

Updated on: Feb 15, 2023 | 3:45 PM

లేటెస్ట్ టెక్ సెన్సేషన్ చాట్ జీపీటీని సీబీఎస్ఈ బోర్డు బ్యాన్ చేసింది. సీబీఎస్ఈ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన నిబంధనలు మంగళవారం విడుదల చేసింది. వాటిల్లో పరీక్ష కేంద్రాల వద్ద నిషేధిత వస్తువుల జాబితాను ప్రకటించింది. దీనిలో స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఓపెన్ ఏఐ  చాట్ జీపీటీ కూడా ఉంది. అంటే ఏ రకంగానూ చాట్ జీపీటీని వినియోగించకూడదని సీబీఎస్ఈ బోర్డు అధికారులు చెబుతున్నారు.

ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు..

సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షకు వచ్చే విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలలోకి తీసుకురావడానికి వీల్లేదని సీబీఎస్ఈ బోర్డు కంట్రోలర్ సాన్యం భారద్వాజ్ చెప్పారు. అలాగే చాట్ జీపీటీని వినియోగించగలిగే ఏ విధమైన పరికరాలైనా కూడా నిషేధమేనని వివరించారు.

ఏంటి ఈ చాట్ జీపీటీ..

చాట్ జీపీటీ( చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రన్స్ ఫార్మర్)ను 2022 నవంబర్ లో లాంచ్ చేశారు. ఇది మనం అడిగి ప్రశ్నకు కచ్చితమైన జవాబులు ఇస్తుంది. చాట్ జీపీటీ ద్వారా మనిషి చేయగలిగే ప్రతి విషయం అచ్చం మనిషిలాగే చేయగలుగుతుంది. కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులు(బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా ఇది చేస్తుంది. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివి చేసేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులను ఇస్తుంది. పాటలు కూడా రాస్తుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్ తయారు చేయడం, ఇలా ఒకటేమిటి సర్వజ్ఞానిలా అన్ని చేయగలుగుతుంది.  మనం ఏది అడిగిన మనిషి సమాధానం ఇస్తున్నట్లుగా కచ్చితైన అవుట్ పుట్ ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బెంగళూరులోని పలు యూనివర్సిటీ క్యాంపస్ లలో ఈ చాట్ జీపీటీ వినియోగాన్ని నిషేధించాయి. యూకే, యూఎస్ లలోనూ ఇదే తరహాలో పలు విశ్వవిద్యాలయాల్లో దీని వినియోగాన్ని బ్యాన్ చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

Latest Articles