Funny Video: ‘ఇదేం సరదారా బాబోయ్!’.. ఎస్కలేటర్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్న పెంపుడు కుక్క..

చాలా మందికి సహజంగానే నచ్చే జంతువులు ఏవైనా ఉండంటే అది కుక్కలు మాత్రమే. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువుగా చెప్పుకునే కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

Funny Video: ‘ఇదేం సరదారా బాబోయ్!’.. ఎస్కలేటర్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్న పెంపుడు కుక్క..
Dog Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 14, 2023 | 4:22 PM

చాలా మందికి సహజంగానే నచ్చే జంతువులు ఏవైనా ఉండంటే అది కుక్కలు మాత్రమే. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువుగా చెప్పుకునే కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరి అటువంటి కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక ఈ వీడియోను చూస్తే ఎవరైనా ‘ఇదేం సరదారా బాబోయ్’ అనాల్సిందే. ఎందుకంటే ఆ కుక్క అలా ఎంజాయ్ చేస్తోంది మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్ మీద. ఇంకా ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వేసుకోవడంతో పాటు సరదా సరదా కామెంట్లు కూడా చేస్తున్నారు.

ViralPosts అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క ఎస్కలేటర్ మీద నుంచి రావడాన్ని మనం చూడవచ్చు. అది ఎస్కలేటర్ ద్వారా నేరుగా పైకి వచ్చి.. దాని పక్కనే ఉన్న మెట్ల ద్వారా మళ్లీ కిందకు వెళ్ళడం కూడా గమనించవచ్చు. అయితే అది కిందే ఆగిపోయిందా అంటే లేదు.. తిరిగి ఎస్కలేటర్ ద్వారా పైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నెెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. 

కాగా, ఈ వైరల్ వీడియోకు ఇప్పటి వరకు లక్ష 67వేలకు పైగా వీక్షణలు.. అలాగే దాదాపు 5 వేల లైకులు వచ్చాయి. మరోవైపు నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తూనే కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజ్ ‘ఈ వీడియో చూస్తుంటే నాకు నిజంగా నవ్వు వస్తోంది.. చాలా క్యూట్‌గా ఉంద’ని  కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ‘జీవితంలో ఇంతకంటే మజా లేదు, టేకాఫ్’ అని.. ఇంకొకరు ‘సేఫ్ ప్లేయర్’ అంటూ ఇలా స్పందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ‘అది ఇక్కడ ఎలా వచ్చింది..? సెక్యూరిటీ గార్డులు లేరా..? దాని ప్రాణాలకు హాని కలిగితే..?’ అంటూ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..