Papaya Seeds: బొప్పాయి గింజలతో కూడా ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణుల సూచన. మరి ఆ క్రమంలో..

Papaya Seeds: బొప్పాయి గింజలతో కూడా ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Papaya Seeds for Health
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 13, 2023 | 6:31 PM

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణుల సూచన. మరి ఆ క్రమంలో శరీరానికి తగిన మొత్తంలో పోషకాలను అందించే ఆహారపదార్థాలలో బొప్పాయి పండు కూడా ఒకటి. బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా బొప్పాయి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. పొట్ట పేగుల్లో విష పదార్థాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహయపడుతుంది. ఇందులో ప్లేవనాయిడ్స్, పోటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా.. బొప్పాయి గింజలతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరానికి మంచి జరుగుతుంది. మరి ఆ ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్: బొప్పాయి గింజలలో పుష్కలంగా ఉండే ఫైబర్ శరీరం అంతటా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ గింజలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి చేరుతుంది. బొప్పాయిలో ఉండే ఒలీక్ యాసిడ్ కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

అధిక బరువు: బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచి.. శరీర వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరంలో అనవసర కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. ఫలితంగా త్వరగా బరువు తగ్గిపోతారు.

ఇవి కూడా చదవండి

నెలసరి నొప్పి: బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. బొప్పాయి గింజలు ఋతుక్రమం సరైన క్రమంలో ఉండేలా చేయడంతో పాటు పీరియడ్స్ నొప్పిని కూడా కొంతవరకూ తగ్గిస్తాయి.

కడుపులో మంట: బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కడుపులోని మంట, నొప్పిని తగ్గిస్తాయి.

క్యాన్సర్: బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్.. అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అందుకోసం రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను తీసుకుని వాటిని చూర్ణంలా చేసి తినండి. లేదా పొడిలా చేసి నీటిలో కలిపి తాగేయండి.

ఫుడ్ పాయిజన్: బొప్పాయి గింజల రసాన్ని తాగడం వల్ల.. కడుపులో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఎస్చెరిచియా కోలి వంటి ఇతర బ్యాక్టీరియాలు చనిపోతాయి.

ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సాధారణ సమాచారం అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ వాటి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి ఆరోగ్య సూచనలను పాటించే ముందు వైద్య నిపుణులు తప్పనిసరిగా సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి