Jyothi Gadda |
Updated on: Feb 13, 2023 | 2:18 PM
మందార పూలతో పూజలు చేస్తారు. మందరా పువ్వులను కూడా జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తారు. ఈ మందార టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మందారా పూల రేకులను ఎండలో ఆరబెట్టుకుని టీ పొడిగా ఉపయోగించవచ్చు. ఈ మందార టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మందార టీని క్రమం తప్పకుండా సిప్ చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మీరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే మీకు మందార టీ మేలు చేస్తుంది.
మందార టీ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఈ టీ కాలేయంలో పేరుకుపోయిన అన్ని మలినాలను తొలగిస్తుంది.
మందార టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీ జీవక్రియ పెంచడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు మందార టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీరు మందార టీని త్రాగవచ్చు. యాంటీబయాటిక్స్ తీసుకోవడంతో పాటు మందార టీని తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు.
మందార టీలో కెఫిన్ ఉండదు. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మినరల్స్ ఉంటాయి. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఈ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. అదనంగా, మందార ఫ్లవర్ టీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.