AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Public Toilet: పబ్లిక్ టాయిలెట్ డోర్స్ పూర్తిగా ఎందుకు ఉండవో తెలుసా? కారణం తెలిస్తే అవాక్కవుతారు..!

ఇంట్లో ఉన్నప్పుడు మన పర్సనల్ టాయిలెట్‌ను వినియోగిస్తాం.. ఏదైనా ఇతర ప్రాంతాలకు, ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించాల్సి వస్తుంది. సాధారణంగా ఇంట్లో టాయిలెట్స్‌కి ఫుల్ డోర్స్ ఉంటాయి.

Public Toilet: పబ్లిక్ టాయిలెట్ డోర్స్ పూర్తిగా ఎందుకు ఉండవో తెలుసా? కారణం తెలిస్తే అవాక్కవుతారు..!
Toilet
Shiva Prajapati
|

Updated on: Feb 14, 2023 | 4:07 PM

Share

ఇంట్లో ఉన్నప్పుడు మన పర్సనల్ టాయిలెట్‌ను వినియోగిస్తాం.. ఏదైనా ఇతర ప్రాంతాలకు, ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించాల్సి వస్తుంది. సాధారణంగా ఇంట్లో టాయిలెట్స్‌కి ఫుల్ డోర్స్ ఉంటాయి. అదే పబ్లిక్ టాయిలెట్స్‌ డోర్స్ అలా ఉండవు. కింది నుంచి కాస్త గ్యాప్ ఉంటుంది. చాలావరకు పబ్లిక్ టాయిలెట్స్ ఇలాగే ఉంటాయి.

ఆఫీస్‌లు, స్కూల్స్, కాలేజీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో చాలా వరకు టాయిలెట్స్ తలుపులు దిగువ భాగాన ఖాళీ ఉంటుంది. లోపల ఉన్నవారి కాళ్లు బయటి నుంచి చూసేవారికి కనిపిస్తాయి. ఈ విధానం పాశ్చాత్య దేశాల్లో అంతటా ఉంటుంది. ఇప్పుడు మనం దేశంలోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు చాలా మంది. మరి ఇందులో ఏదైనా లాజిక్ ఉందా? ఉంటే ఆ లాజిక్ ఏంటి? ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎమర్జెన్సీ పరిస్థితిలో..

టాయిలెట్ డోర్స్ దిగువ భాగాన కొంత ఖాళీగా ఉండటానికి కారణం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎమర్జెన్సీ పర్పస్‌లో ఇది ఉపకరిస్తుంది. ఒకవేళ ఎవరైనా టాయిలెట్‌కి వెళ్లి.. ఏదైనా కారణం చేత స్పృహతప్పి పడిపోయినా, మరేదైనా ప్రమాదానికి గురైనా వెంటనే తెలుసుకోవడానికి వీలుంటుంది. అదే టాయిలెట్ డోర్ ఫుల్‌గా ఉంటే లోపల ఉన్న వారి పరిస్థితిని ఎవరూ గమనించలేరు.

ఇవి కూడా చదవండి

పరిశుభ్రత..

టాయిలెట్ డోర్ దిగువ భాగాన ఖాళీగా ఉండటం వల్ల క్లీనర్లకు టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుంది. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్‌ తరచుగా ఉపయోగించబడతాయి. ఈ కారణంగా.. వాటిని రోజంతా చాలాసార్లు శుభ్రపరచాల్సి వస్తుంది. తలుపు కింది భాగం ఖాళీ స్థలం ఉండటం వల్ల శుభ్రం చేయడం చాలా ఈజీ అవుతుంది.

భద్రత..

టాయిలెట్ డోర్ దిగువన ఖాళీగా ఉండటం వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అప్రమత్తం అయ్యే ఛాన్స్ ఉంటుంది. డ్రగ్స్ వాడకం, శృంగారం వంటి అసాంఘీక చర్యలకు పాల్పడకుండా ఇది ఉపకరిస్తుంది.

చాలా ఈజీగా..

టాయిలెట్ దిగువ భాగంలో ఖాళీగా ఉండే డోర్‌లను తయారు చేయడం, రవాణా చేయడం, కొనుగోలు వంటిదంతా చాలా ఈజీగా ఉంటుంది. కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకేవిధంగా ఉంటుంది.

దుర్వాసన నుంచి రక్షణ..

డోర్ కింది భాగంలో గ్యాప్ ఉండటం వలన దుర్వాసన రాదు. ఫలితంగా ఆ ప్రాంతం అంతా సురక్షితంగా ఉంటుంది. గాలి స్వే్చ్ఛగా తిరగడం వల్ల దుర్వాసన బయటకు వెళ్లిపోతుంది. తడిగా ఉండకుండా, ఎప్పటికప్పుడు ఆరిపోతుంటుంది. ఫలితంగా అనారోగ్యానికి కారణమయ్యే వైరస్‌లు డెవలప్ అవ్వవు.

మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..