PAN-Aadhaar Link: మీ ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేశారా? చివరి తేదీ ఇదే.. లేదంటే తిప్పలు తప్పవు
మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేశారా? ఇంకా లేదంటే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను మార్చి 31, 2023లోగా వెంటనే అనుసంధానం చేయండి. ఒకవేళ ఎవరైనా గడువు తేదీలోగా లింక్ చేయకపోతే..
మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేశారా? ఇంకా లేదంటే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను మార్చి 31, 2023లోగా వెంటనే అనుసంధానం చేయండి. ఒకవేళ ఎవరైనా గడువు తేదీలోగా లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ పాన్ హోల్డర్‌లు మార్చి 2023 చివరి నాటికి ఆధార్‌తో కార్డును లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చట్టం ప్రకారం.. మినహాయింపు వర్గంలోకి రాని పాన్-హోల్డర్లందరికీ తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. పాన్, ఆధార్‌ను లింక్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. భారత ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా పాన్-ఆధార్‌ల లింక్ ఎలా చేయవచ్చంటే..
- తొలుత అధికారిక వెబ్‌సైట్ eportal.incometax.gov.in ను ఓపెన్ చెయ్యాలి.
- పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు యూజర్ పాన్ లేదా ఆధార్ నంబర్ యూజర్ ఐడీగా వినియోగించవచ్చు. తర్వాత పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- హోమ్‌పేజీలో ‘Quick Links’పై క్లిక్ చేయాలి.
- తర్వాత లింక్ ఆధార్ ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పేరును, నంబర్‌ను యాడ్ చేయాలి.
- తర్వాత ‘I have only year of birth in Aadhaar card’ అనే బాక్సును ఎంపిక చేసుకోవాలి.
- Captchaను తప్పులులేకుండా టైప్ చేసి సబ్‌మిట్ చేయాలి.
- ఆధార్, పాన్ కార్డ్ లింక్ అయిన తర్వాత మీకు నిర్ధారణ నోటిఫికేషన్ వస్తుంది.
- ఒకవేళ మీ పాన్, ఆధార్ కార్డ్ వివరాలు సరిపోలకపోతే.. మీకు రిజెక్ట్ మెసేజ్ వస్తుంది. తర్వాత మళ్లీ పై విధంగా అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.