Chicken: చికెన్‌ ఎక్కువగా తింటున్నారా? ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే జీవితంలో ముట్టుకోరు..

కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదంటే నమ్మంది..! ప్రతి రోజూ చికెన్‌, మటన్‌.. రకరకాల స్పెషల్స్‌ లాంచేస్తుంటారు. ఐతే నిత్య జీవితంలో చికెన్‌ అధికంగా తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారీన పడే అవకాశం ఉన్నట్లు..

Chicken: చికెన్‌ ఎక్కువగా తింటున్నారా? ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే జీవితంలో ముట్టుకోరు..
Chicken
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2023 | 7:25 PM

కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదంటే నమ్మంది..! ప్రతి రోజూ చికెన్‌, మటన్‌.. రకరకాల స్పెషల్స్‌ లాంచేస్తుంటారు. ఐతే నిత్య జీవితంలో చికెన్‌ అధికంగా తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారీన పడే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. చికెన్ తినడం వల్ల మన శరీరంలో ప్రొటీన్స్ పెరుగుతాయి. ప్రొటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక రకాల వైరస్‌లను ఎదుర్కోనే శక్తి మన శరీరానికి వస్తుంది. అయితే కోళ్ల ఫారంలో పెంచే కోళ్లను తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదంటున్నారు నిపుణులు.

ఆరోగ్యం కదా అని రోజూ తింటే కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. చికెన్లో ప్రొటీన్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. రోజూ తినడం వల్ల కొవ్వు రూపంలో మారి శరీరంలో పేరుకుపోతుంది. క్రమంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో లిపిడ్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. చికెన్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలను అతిగా తినడం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆయువు క్షీణించి అకాల మరణం సంభవిస్తుంది. పచ్చి చికెన్‌పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. చికెన్‌ను ముట్టుకుంటే అవి చేతులకు అంటుకుని పొట్ట లోనికి ప్రమాదం కూడా లేకపోలేదు. పౌల్ట్రీ రైతులు కోళ్లకు ఇచ్చే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ల వల్ల.. ఆ చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్స్ నిరోధకత పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం తలెత్తితే వైద్యులు సూచించే మందులు వారి శరీరాలపై ప్రభావం చూపవు.

అందువల్ల బ్రాయిలర్ కోళ్లను తినడం కంటే నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఈ రోజుల్లో నాటు కోళ్లు ఎక్కడ దొరకుతాయనేకునే వాళ్లు.. రోజూ కాకుండా వారానికి రెండు, మూడు సార్లు తినమని సూచిస్తున్నారు. రోజూ తినే అలవాటు ఉంటే మాత్రం పద్ధతి మార్చుకోవల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. చేపలు తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం మాంసం. వారానికి రెండు సార్లు తిన్నా చాలు మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు