Health Tips: శనగలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తినకుండా ఉండలేరు..

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అంటే సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న సమతుల్య..

Health Tips: శనగలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే తినకుండా ఉండలేరు..
Chana And Jaggery Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 14, 2023 | 7:50 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అంటే సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ కోవకు చెందినదే బెల్లం శనగపప్పు. ఇవి రెండు కలిపి తినడం శరీరానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేయడంతో పాటు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మరి బెల్లం, శనగపప్పులను కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం, శనగపప్పు ఆరోగ్య ప్రయోజనాలు..

ఇవి కూడా చదవండి
  1. బెల్లం, శనగపప్పును కలిపి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
  2. బెల్లంలో ఐరన్, మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నందున రక్తహీనత సమస్య ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
  3. బెల్లం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.
  4. శరీరంలోని శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడే శనగపప్పులను తప్పని సరిగా తీసుకోవలసిన చిరుతిండి.
  5. బెల్లం పప్పులో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది దంతాలు చెడిపోకుండా కాపాడుుతుంది.
  6. ఈ రెండింటిలో ఉండే పొటాషియం గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచుతుంది
  7. మూత్ర సమస్యకు బెల్లం,శనగపప్పు మిశ్రమం చెక్ పెడుతుంది.
  8. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీర జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తద్వారా మలబద్దకం దూరం అవుతుంది. ఇంకా ఎముకలు గట్టి పడతాయి.
  9.  శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో కాల్చిన శెనగలు మేలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి