AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident Policy: రోజుకు ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే.. రూ. 10 లక్షల ప్రమాద బీమా.. పూర్తి వివరాలివే..

పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని ఇటీవలి కాలంలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. టాటా ఏఐజీతో కలిసి దీనిని..

Accident Policy: రోజుకు ఒకే ఒక్క రూపాయి చెల్లిస్తే..  రూ. 10 లక్షల ప్రమాద బీమా.. పూర్తి వివరాలివే..
Postal Bank Accident Policy
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 14, 2023 | 6:27 PM

Share

ప్రస్తుత కాలంలో బీమాలు, బ్యాంక్ డిపాజిట్ల పట్ల ప్రజల్లో అవగాహన ఎంతగానో పెరిగింది. జీవిత బీమా(Life Policy), ఆరోగ్య బీమా(Health Policy) తరహాలో ప్రమాద బీమా(Accident Policy) కూడా తీసుకునే వారి సంఖ్య రానురానూ పెరిగిపోతోంది. ఇక ఈ బీమాను అనేక సంస్థలు ఆఫర్ చేస్తుండగా.. వాటి తరహాలోనే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా ఒక ప్రమాద బీమా పథకాన్ని ఇటీవలి కాలంలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. టాటా ఏఐజీతో కలిసి దీనిని ప్రారంభించింది పోస్టల్ డిపార్ట్‌మెంట్. గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట పోస్టాఫీసు ఖాతాదార్ల కోసం ప్రమాద బీమాని తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ తీసుకున్న వాళ్లు ఏడాదికి కేవలం 399 రూపాయలు చెల్లిస్తే చాలు.. 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం పొందవచ్చు. అంటే రోజుకు ఒక్క రూపాయి కంటే కాస్త ఎక్కువ ఖర్చుతో ఒక భారీ ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. తద్వారా మీ మీద ఆధారపడిన వాళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వవచ్చు. మరి ఆ బీమా గురించి పూర్తి వివరాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరెవరు ఈ బీమాకు అర్హులు..?

18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా ఈ ప్రమాద బీమాని తీసుకోవచ్చు. ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాలి. అంటే ఈ బీమా తీసుకోవాలంటే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతా ఉండడం తప్పనిసరి. ఈ బీమా తీసుకున్నవారికి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, ఏదైనా అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా 10 లక్షల రూపాయలు చెల్లిస్తారు పోస్టల్ శాఖవారు. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరితే.. ఐపీడీ (ఇన్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) కింద 60 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. ఔట్‌ పేషెంట్‌ విషయంలో.. 30 వేల రూపాయలు లేదా క్లెయిమ్‌ చేసిన మొత్తంలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు.

ప్రమాద బీమాతో కలిగే ఇతర అదనపు ప్రయోజనాలు..

ఈ ప్రమాద బీమా ద్వారా మీరు మరికొన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా ఇద్దరు పిల్లలకు వారి ఫీజులో 10 శాతం లేదా లక్ష రూపాయల వరకు ఎంచుకోవచ్చు. కుటుంబ ప్రయోజనం కింద 25 వేల రూపాయలు, అంత్యక్రియల కోసం మరో 5 వేల రూపాయలు కూడా అందుతాయి. ఆసుపత్రిలో చికిత్స సమయంలో రోజువారీ నగదు రూపంలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ఇదే బీమా రూ. 299లకు కూడా..

ఇదే పథకాన్ని 299 రూపాయల ఆప్షన్‌తోనూ తపాలా శాఖ( పోస్టల్ డిపార్ట్‌మెంట్) అందిస్తోంది. దీనిని ఎంపిక చేసుకుంటే ఏడాదికి 299 రూపాయలు చెల్లించినా 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణం, వైకల్యం, పక్షవాతం, వైద్య ఖర్చులు వంటివి ఈ ఆప్షన్‌లో కవర్‌ అవుతాయి. అయితే 399 రూపాయల ప్రమాద బీమా ద్వారా అందే అదనపు ప్రయోజనాలు మాత్రం అందవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..