Viral Video: ఈ మాత్రం సంస్కారం ఉంటే.. ఏ అత్త అయినా కరిగిపోవాల్సిందే.. వైరల్ అవుతున్న చిన్నారి వీడియో..

కాళ్లను తాకి కళ్లకు అద్దుకుంటున్న ఆ చిన్నారి సంస్కారాన్ని చూసిన నెటిజన్లు మురిసిపోవడమే కాక నవ్వే ఓపిక లేదంటూ సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు. కాళ్లను తాకితే అందులో..

Viral Video: ఈ మాత్రం సంస్కారం ఉంటే.. ఏ అత్త అయినా కరిగిపోవాల్సిందే.. వైరల్ అవుతున్న చిన్నారి వీడియో..
Kid Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 14, 2023 | 7:22 PM

చిన్న పిల్లలను సంబంధించిన వీడియోలను చూడడానికి అందరూ ఇష్టపడతారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కానీ ఆ పనిలో సంతోషాన్ని వెతుకున్నే చిన్నారుల వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా అవి వైరల్ అవుతూనే ఉంటాయి కూడా. అయితే ఇప్పుడు కూడా నెట్టింట సంస్కారవంతమైన ఓ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది. కాళ్లను తాకి కళ్లకు అద్దుకుంటున్న ఆ చిన్నారి సంస్కారాన్ని చూసిన నెటిజన్లు మురిసిపోవడమే కాక నవ్వే ఓపిక లేదంటూ సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు. కాళ్లను తాకితే అందులో నవ్వుకోవడానికి ఏముందని ఆశ్చర్యపోతున్నారా..? అసలు విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడంతో పాటు షాక్ అవుతారు కూడా. ఎందుకంటే ఆ చిన్నారి తాకింది పెద్దల కాళ్లు లేదా మనుషుల కాళ్లు కాదు. షాపింగ్ మాల్‌లోని డిస్ప్లే డాల్స్ కాళ్ల మీద పడింది.

nysa.gulati అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘ఇంతటి సంస్కారవంతురాలైన చిన్నారిని ఎక్కడైనా చూశారా..?’ అనే కాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోలో ఆ చిన్నారి బొమ్మల కాళ్లను తాకి కళ్లకు అద్దుకుంటుంది. ఈ దృష్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇంకా ఈ వీడియోపై ‘అత్తారింటికి వెళ్లేందుకు ప్రాక్టీస్’ అని కూడా రాసి ఉండడంతో నెటిజన్లకు ఇది విపరీతంగా నచ్చేసింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 89 లక్షల వీక్షణలు, 3 లక్షల 42 వేల లైకులు వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లలో కొందరు‘  ఈ మాత్రం సంస్కారం ఉంటే అత్తాకోడళ్లకు గొడవలే ఉండవ’ని కామెంట్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ‘పాప వయసు కంటే ఆమె సంస్కారం చాలా ఎక్కువగా ఉంద’ని రాసుకొస్తున్నారు. మరికొందరు ‘నాకు ఈ అమ్మాయే కొడలిగా కావాలి’ అని అంటున్నారు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..