AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: కిలో బూడిద రూ.1800.. అమ్మకానికి ఉంచిన ప్రముఖ వెబ్ సైట్.. మండిపడుతున్న నెటిజన్లు..

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే ఆహారాన్ని వండుతుంటారు. గ్యాస్ వినియోగం అధికమైనా.. కొందరు పాత కాలపు పద్ధతులనే పాటిస్తుంటారు. అయితే.. కట్టెల పొయ్యిపై ఆహారాన్ని వండటం చాలా రిస్క్..

Trending: కిలో బూడిద రూ.1800.. అమ్మకానికి ఉంచిన ప్రముఖ వెబ్ సైట్.. మండిపడుతున్న నెటిజన్లు..
Ash Purchasing
Ganesh Mudavath
|

Updated on: Feb 15, 2023 | 6:47 AM

Share

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే ఆహారాన్ని వండుతుంటారు. గ్యాస్ వినియోగం అధికమైనా.. కొందరు పాత కాలపు పద్ధతులనే పాటిస్తుంటారు. అయితే.. కట్టెల పొయ్యిపై ఆహారాన్ని వండటం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. పాత్రలను శుభ్రం చేయడం, పొయ్యి నుంచి వచ్చే పొగ తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. ఒకప్పుడు చాలా ఇళ్లలో కట్టెల పొయ్యిపైనే ఆహారం వండుకునేవారు. ఎందుకంటే అప్పట్లో గ్యాస్ స్టవ్ లభ్యత చాలా తక్కువగా ఉండేది. కిరోసిన్ ను కూడా ఉపయోగించే వారు. వంట అంతా అయిపోయిన తరువాత.. కట్టెల పొయ్యిలో పొగ పోగవుతుంటుంది. వాటిని తీసి పడేయడమో లేక గిన్నెలు శుభ్రం చేసేందుకో ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం దీని గురించి టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా.. ఎందుకుంటే.. యాష్ కు సంబంధించిన ఓ పోస్ట్ ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది.

బాబా రామ్‌దేవ్.. అమెజాన్ లో అమ్మకానికి ఉంచిన బూడిద ప్యాకెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో 250 గ్రాముల ఈ ప్యాకెట్ ధర రూ.450గా, అంటే దీని ప్రకారం, ఒకదాని ధర కిలో చుల్హా బూడిద రూ.1800. ఈ బూడిదను ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. బూడిదకు ఇంత ఎక్కువ ధర పలకడం చూసి బాబా రామ్‌దేవ్ కూడా ఆగ్రహానికి గురయ్యారు. మన పూర్వీకులు పాత్రలు కడగడానికి ఉపయోగించే పొయ్యి బూడిదను మొదట అశాస్త్రీయంగా పిలిచి ఎగతాళి చేశారు. క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమయ్యే రసాయనాల డిష్‌వాష్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

బాబా రామ్‌దేవ్ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో నెటిజన్లు పోస్ట్ ను లైక్ చేశారు. అంతే కాకుండా పోస్ట్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..