Valentine’s Day: మీకు లవర్ లేరా..? సింగిల్స్‌కి అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్.. బిర్యానీ ఫ్రీ..

వాలెంటైన్స్ డే వేడుకలను ప్రేమికులు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ ప్రియురాలు/ప్రియుడిని ఏదో ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆకట్టుకున్నారు. అయితే, ప్రేమికుల రోజున..

Valentine's Day: మీకు లవర్ లేరా..? సింగిల్స్‌కి అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్.. బిర్యానీ ఫ్రీ..
Biryani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2023 | 6:19 PM

వాలెంటైన్స్ డే వేడుకలను ప్రేమికులు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ ప్రియురాలు/ప్రియుడిని ఏదో ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో ఆకట్టుకున్నారు. అయితే, ప్రేమికుల రోజున అస్సాంలోని సిల్చార్ జిల్లా, ఖానా కసానాలోని ఒక రెస్టారెంట్ ఒంటరిగా ఉన్న వారికి (ప్రేమలో లేని వారికి) ఉచితంగా బిర్యానీని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. వాలెంటైన్స్ డే నాడు ఒంటరిగా ఉన్నవారు బాధపడకుండా ఉండేందుకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది. ఈ రెస్టారెంట్‌లో ఒంటరిగా ఉన్న వారందరికీ ప్రేమను పంచేందుకు “కడుపు ప్రేమగా” అనిపించేలా హాఫ్-ప్లేట్ బిర్యానీని ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. ఇక్కడికి వచ్చే సింగిల్స్‌కి బిర్యానీ ఉచితం అని రెస్టారెంట్ యజమాని చిరంజీవి గోస్వామికి చెప్పారు. ప్రేమికుల రోజున సింగిల్స్‌ బాధపడకుండా ఉండేందుకు.. ఈ రకంగా సెలబ్రేట్ చేస్తున్నట్లు తెలిపింది.

సింగిల్స్‌కి బిర్యానీ ఫ్రీగా ఇస్తాం.. సింగిల్స్‌కి కూడా ఏదో ఒక ఆప్షన్‌ ఉండాలి అని యాజమాని తెలిపారు. ఒకరు ఒంటరిగా ఉన్నారా లేదా..? అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారన్న అంశంపై యజమాని మాట్లాడుతూ.. జంట లేదా ఒంటరిగా ఉన్నారా అనేది కనుగొనడం సాధ్యం కాదని, ఎవరైనా తమను సంప్రదిస్తే.. వారిని పరిగణించి వారికి ఉచిత ఆహారం ఇస్తామని చెప్పారు.

వాలెంటైన్స్ డే, సెయింట్ వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్ ఫీస్ట్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో