Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2023: ‘కౌ’గిలిగింతలు.. పవిత్రమైన ప్రేమను మోహంతో పోల్చకండి..!

ప్రేమ అనంతమైనది..! రాసే పదాల్లో.. పలికే మాటల్లో.. చేతల్లో.. వ్యక్తం చేయలేనిది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమ విశ్వవ్యాప్తమైన ఓ అందమైన భావన. అది ఏ ఒక్క రోజుకో.. ఏ ఒక్క ఘడియకో సంబంధించింది కానేకాదు..

Valentine's Day 2023: 'కౌ'గిలిగింతలు.. పవిత్రమైన ప్రేమను మోహంతో పోల్చకండి..!
'cow Hug Day' On Valentine'
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 14, 2023 | 6:05 PM

ప్రేమ అనంతమైనది..! రాసే పదాల్లో.. పలికే మాటల్లో.. చేతల్లో.. వ్యక్తం చేయలేనిది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమ విశ్వవ్యాప్తమైన ఓ అందమైన భావన. అది ఏ ఒక్క రోజుకో.. ఏ ఒక్క ఘడియకో సంబంధించింది కానేకాదు. ఓ వైపు వేగంగా గడిచే కాలం.. మరోవైపు తిరిగిరాకుండా తరిగే వయసు.. ఏమైతేనైం యావత్‌ ప్రపంచం నేడు ప్రేమికుల దినోత్సవాన్ని తమదైన పంథాలో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్‌ డేకు నిరసనగా గత సోమవారం ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట ఈ సంస్థపై పలు జోకులు పేలుతున్నాయి.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ గౌపాలన్ అండ్‌ పశుధాన్ ప్రమోషన్ బోర్డు ఛైర్మన్ స్వామి అఖిలేశ్వరానంద గిరి జబల్‌పూర్‌లోని తన నివాసంలో కౌహగ్‌ డేను ఘనంగా జరుపుకున్నారు. ప్రేమికుల రోజున గోవులను పూజించడం ద్వారా వినూత్నంగా నిరసన తెలిపారు. ‘వాలెంటైన్స్ డే కేవలం కామాన్ని మాత్రమే సృష్టిస్తుంది.. అది కరుణ, అనుబంధ ఆప్యాయతలను వెల్లడించదు. అందుకే మేము ప్రేమికుల రోజుకు నిరసనగా కౌ హగ్ డే జరుపుకోవాలని పిలుపునిచ్చాం. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు మా మద్ధతు తెలిపాం. ఆ తర్వాత బోర్డు తన పిలుపును ఉపసంహరించుకున్నప్పటికీ మా మద్దతును మాత్రం వెనక్కు తీసుకోలేదు. గోవులను కౌగిలించుకుని, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రేమను కామంగా ఉపయోగించకుండా మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. స్వచ్ఛమైన ప్రేమ ప్రకృతిని ప్రేమిస్తుందని యువతకు సందేశం ఇచ్చారు. కాగా వాలంటైన్స్‌ డేను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలనే ఏడబ్ల్యూబీఐ పిలుపునిచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకొంది. దీంతో ఆ సంస్థ తన పిలుపును ఉపసంహరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.