Gold Man: నేను రౌడీని కాదు.. కేవలం జోకర్‌ని.. అలా చేయడం నాకు ఇష్టం..

నేను రౌడీని కాదు, దాదా అస్సలు కాదు.. కేవలం జోకర్‌ని.. నన్ను నమ్మండి అంటూ తన గోడు వెల్లబోసుకున్నారు సోషల్‌మీడియాలో గోల్డ్‌మ్యాన్‌గా పాపులర్‌ అయిన వరిసూర్‌ సెల్వం. తన ఒంటి..

Gold Man: నేను రౌడీని కాదు.. కేవలం జోకర్‌ని.. అలా చేయడం నాకు ఇష్టం..
Gold Man
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 14, 2023 | 5:47 PM

నేను రౌడీని కాదు, దాదా అస్సలు కాదు.. కేవలం జోకర్‌ని.. నన్ను నమ్మండి అంటూ తన గోడు వెల్లబోసుకున్నారు సోషల్‌మీడియాలో గోల్డ్‌మ్యాన్‌గా పాపులర్‌ అయిన వరిసూర్‌ సెల్వం. తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తన పూర్వీకుల నుంచి తనకు సంక్రమించిన ఆస్తి అని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ 10 కోట్లు ఉంటుందని తెలిపారు. తన మెడలో ఉన్న గోల్డ్‌ చైన్‌ రెండున్నర కిలోలు అని, దాని విలువే కోటిన్నర ఉంటుందని తెలిపాడు. గతంలో తాను కుటుంబ తగాదాల నేపధ్యంలో జైలుకు వెళ్లానని, ఇప్పడు ఎలాంటి గొడవలు లేవని ఓ మీడియా సమావేశంలో చెప్పారు.

తన ఒంటిమీద ఉన్న బంగారం చూసి తనను ఓ దాదా అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తనను చూసి జనం భయపడుతున్నారని, అందువల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారణంగా తన కుటుంబం ఇబ్బంది పడటం తనను చాలా బాధించిందని చెప్పారు. అలాగే తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనని, తాను రాజకీయాలకు దూరమని వివరించారు.

ఒంటినిండా బంగారం వేసుకోవడం తనకు ఇష్టమన్న ఆయన, తన ఒంటిపై బంగారం చూసి అందరూ తనను పెద్ద రౌడీ అనుకుంటున్నారని, మీడియా ముఖంగా చెబుతున్నా.. నేను రౌడీని, దాదాని కాదు, కేవలం జోకర్‌ని మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..