AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: మధ్యాహ్నం చికెన్‌.. సాయంత్రం చేపల ఫ్రై తిన్న యువకుడు.. పాపం చివరకు..

ఓ యువకుడు ఇష్టంతో చికెన్‌ను ఫుల్లుగా లాగించాడు.. మధ్యాహ్నం చికెన్ ఫుల్లుగా తిన్న తర్వాత.. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు.. చివరకు ఊపిరాడక చనిపోయాడు.

Chicken: మధ్యాహ్నం చికెన్‌.. సాయంత్రం చేపల ఫ్రై తిన్న యువకుడు.. పాపం చివరకు..
Chicken Curry
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2023 | 5:44 PM

Share

ఓ యువకుడు ఇష్టంతో చికెన్‌ను ఫుల్లుగా లాగించాడు.. మధ్యాహ్నం చికెన్ ఫుల్లుగా తిన్న తర్వాత.. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు.. చివరకు ఊపిరాడక చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దిండుగల్‌లో అధికంగా చికెన్‌ తిన్న యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. కలికంపట్టికి చెందిన చోలమలై కుమారుడు వసంతకుమార్‌ (22) కార్మికుడిగా పనులు చేస్తున్నాడు. అయితే, ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం ఇంట్లో వండిన చికెన్‌‌ను ఎక్కువగా తిన్నాడు.

అనంతరం, కాసేపు సేదతీరాడు. సాయంత్రం చేపల వేపుడు తిన్నాడు. అనంతరం రాత్రి అతను ఊపిరాడక ఇబ్బంది పడుతూ కనిపించాడు. తనకు ఊపిరి ఆడటం లేదంటూ అవస్థపడుతూ కుటుంబసభ్యులకు తెలిపాడు. అయితే, కొద్దిసేపు నడిస్తే తగ్గుతుందని తల్లిదండ్రులు చెప్పడంతో వీధిలో నడుస్తూ కిరాణా షాపు దగ్గరికి వెళ్లాడు. త్వరగా జీర్ణం అవుతుందని కూల్‌డ్రింక్‌ తాగాడు.

ఆ తర్వాత వీధిలో నడుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ లో వచ్చిన వైద్యసిబ్బంది పరిశీలించి వసంతకుమార్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీంతో చోలామలై దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు చిన్నలాంపట్టి పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
మీరు బ్యాంకు లాకర్‌ను ఉపయోగిస్తున్నారా? మారనున్న ఛార్జీలు!
మీరు బ్యాంకు లాకర్‌ను ఉపయోగిస్తున్నారా? మారనున్న ఛార్జీలు!
ప్రభుదేవా,లారెన్స్ కూడా షాక్ అయ్యేలా స్టెప్పులేసి బుడ్డోడు
ప్రభుదేవా,లారెన్స్ కూడా షాక్ అయ్యేలా స్టెప్పులేసి బుడ్డోడు
RRB పారా మెడికల్ పరీక్షల తేదీలు ఇవే.. 2 రోజుల్లో అడ్మిట్ కార్డులు
RRB పారా మెడికల్ పరీక్షల తేదీలు ఇవే.. 2 రోజుల్లో అడ్మిట్ కార్డులు
పట్టు వదలని విక్రమార్కులు..! ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..
పట్టు వదలని విక్రమార్కులు..! ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..
షాకింగ్ రిపోర్ట్: యువ భారతం కుంగిపోతుందా? ప్రపంచ ర్యాంకింగ్స్‌లో
షాకింగ్ రిపోర్ట్: యువ భారతం కుంగిపోతుందా? ప్రపంచ ర్యాంకింగ్స్‌లో
UPSC సివిల్స్‌లో 1st ర్యాంకు కొట్టిన డాక్టర్‌ బాబు.. !
UPSC సివిల్స్‌లో 1st ర్యాంకు కొట్టిన డాక్టర్‌ బాబు.. !
వాట్సాప్ కొత్త ఫీచర్‌.. చాటింగ్ ఇక మరింత స్పీడ్!
వాట్సాప్ కొత్త ఫీచర్‌.. చాటింగ్ ఇక మరింత స్పీడ్!
ఒంట్లో షుగర్ ఉన్నా కన్నీళ్లు మాత్రం ఉప్పగానే ఎందుకుంటాయి?
ఒంట్లో షుగర్ ఉన్నా కన్నీళ్లు మాత్రం ఉప్పగానే ఎందుకుంటాయి?
ఇది నోట్లో వేసుకుంటే పాటలు వినిపిస్తాయి.. కొత్త టెక్నాలజీ
ఇది నోట్లో వేసుకుంటే పాటలు వినిపిస్తాయి.. కొత్త టెక్నాలజీ
ఫైనల్‌కు ముందు కివీస్‌కు ఇచ్చిపడేసిన సూర్య భాయ్.. ఏమన్నాడంటే?
ఫైనల్‌కు ముందు కివీస్‌కు ఇచ్చిపడేసిన సూర్య భాయ్.. ఏమన్నాడంటే?