AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. కాలేశ్వరం ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 47 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ రాజగోపురాలు, ప్రకారం, గర్భగుడి, ఉప ఆలయాలను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఇంతకాలం పూజలు నిర్వహించిన అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు కాళేశ్వర క్షేత్రం కూల్చివేతల సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు.

Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం..
Kaleshwaram Temple Reconstruction
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 12:02 PM

Share

ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంఘం కాళేశ్వరం తీరాన వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా ప్రసిద్దిగాంచిన కాలేశ్వర ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.198 కోట్ల నిధులతో ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో భారీ రాజగోపురాలు, ఉపఆలయాలు, పార్వతిదేవి, సరస్వతి అమ్మవారి ఆలయం, అబ్బురపరిచే ప్రాకారాలు నిర్మాణాలు చేపట్టడానికి నిధులు కేటాయించారు. కృష్ణ శిలలతో అధునాతన హంగులతో నూతన గుడి పునఃనిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న ఆలయం కూల్చివేత పనులలు చకచగా కొనసాగుతున్నాయి. గుడి నిర్మాణ పనులు షురూచేసిన గుత్తేదార్ కూల్చివేతలు మొదలుపెట్టారు. నైరుతి మూల నుండి మొదలుపెట్టిన కూల్చివేతలు వారం రోజుల నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

తూర్పు వైపున ఉండే ప్రధాన రాజగోపురంతో పాటు నలు దిక్కులో ఉన్న రాజగోపురాలు నేలమట్టం చేశారు. సరస్వతి ఆలయం, పార్వతిదేవి ఆలయం ఉప ఆలయాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గర్భగుడిని సైతం గురువారం కూల్చివేశారు. ఈ క్రమంలో గర్భగుడి కూల్చివేతలను చూసేందుకు వచ్చిన అర్చకులు దేవాదాయశాఖ సిబ్బంది, భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు ప్రస్తుతం ఉన్న ఈ ప్రాకారాలు, రాజగోపురాలు 1979లో పునర్నిర్మానం చేపట్టారు. కాలేశ్వర క్షేత్ర మహిమ నలుదిక్కుల వ్యాపించింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించిన పలువురు పీఠాధిపతులు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి చరిత్రను బాహ్య ప్రపంచాన్ని తెలిసేలా చేశారు. ఈ క్రమంలో స్థానిక మంత్రి శ్రీధర్ బాబు కాలేశ్వర క్షేత్రం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే నిధులు మంజూరు అయ్యాయి.

రూ.198 కోట్ల వ్యయంతో ఏడాది వ్యవధిలో పూర్తిగా రాతి కట్టడాలతో ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి కొత్త రూపు దిద్దాలని పనులు పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగా జూన్ 30 నుండి ఆలయంలో కూల్చివేతల కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ లోపు పూర్తిగా కూల్చివేతలు పూర్తిచేసి తిరిగి పునర్నిర్మాణ పనులు చేపట్టానన్నారు.

వీడియో చూడండి..

Follow Us
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!