AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: వీళ్లు మామూలు స్మగ్లర్లుకాదు.. రూ.14 కోట్ల విలువైన 24 కిలోల బంగారాన్ని ఎక్కడెక్కడ దాచారో తెలిస్తే..

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు మీదగా భారత్‌కు భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తుండగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు డీఆర్‌ఐ టీంలు వ్యూహాత్మక పథకాన్ని రూపొందించి..

Gold Smuggling: వీళ్లు మామూలు స్మగ్లర్లుకాదు.. రూ.14 కోట్ల విలువైన 24 కిలోల బంగారాన్ని ఎక్కడెక్కడ దాచారో తెలిస్తే..
Operation Eastern Gateway
Srilakshmi C
|

Updated on: Feb 13, 2023 | 6:33 PM

Share

‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్‌వే’ పేరుతో చేపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారీ మొత్తంలో స్మగ్లింగ్‌ బంగారం పట్టివేసింది. బంగ్లాదేశ్, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ సిండికేట్ త్రిపుర రాష్ట్రంలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు మీదగా భారత్‌కు భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తుండగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు డీఆర్‌ఐ టీంలు వ్యూహాత్మక పథకాన్ని రూపొందించి, చాకచక్యంగా అమలు చేశాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సిండికేట్‌లోని 8 మంది వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లోని దల్‌ఖోలా రైల్వే స్టేషన్‌లో అస్సాంలోని బదర్‌పూర్ జంక్షన్ నుంచి సీల్దాకు వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను సిలిగురి వద్ద డీఆర్‌ఐ బృంధం పట్టుకుంది. వాళ్ల వద్ద రూ.10.66 కోట్ల విలువైనా దాదాపు 18.66 కిలోల బరువున్న 90 బంగారు స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్ట్రిప్స్‌ను ఫ్యాంట్‌ బెల్టుల్లో దాచుకున్నారు. అగర్తల సమీపంలో ఫోర్‌ వీలర్‌లో డ్రైవర్ సైడ్ ఫ్రంట్ కింద నిర్మించిన ప్రత్యేక కుహరంలో రహస్యంగా దాచిపెట్టిన 2.25 కిలోల బరువున్న రెండు బంగారు కడ్డీలను స్వీధీనం చేసుకన్నారు. దీని విలువ1.30 కోట్ల రూపాయలు ఉంటుంది.

ఇక అసోంలోని కరీంగంజ్ వద్ద అగర్తల నుంచి సీల్దాకు రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి 2.03 కోట్ల రూపాయల విలువ చేసే 3.50 కిలోల బరువున్న 8 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మూడు చోట్ల చేసిన దాడుల్లో రూ.14 కోట్లు విలువైన దాదాపు 24.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కాగా ఈ ఏడాది డీఆర్‌ఐ పలు చోట్ల చేపట్టిన దాడుల్లో వెయ్యి కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.