Bikes Registration: ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన సర్కార్.. ఎందుకో తెలుసా ?

పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10న ప్రకటించింది. పర్యావరణ అనుకూల రవాణావ్యవస్థను ప్రోత్సహించే..

Bikes Registration: ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన సర్కార్.. ఎందుకో తెలుసా ?
Bikes Registration
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 12, 2023 | 1:36 PM

పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఫిబ్రవరి 10న ప్రకటించింది. పర్యావరణ అనుకూల రవాణావ్యవస్థను ప్రోత్సహించే దిశగా చండీగఢ్‌ పాలనాయంత్రాంగం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ’లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది. నాన్-ఎలక్ట్రిక్ వాహనాలను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితోపాటు పెట్రోల్‌తో నడిచే ఫోర్‌ వీలర్‌ వాహనాల్లో 10 శాతం, ద్విచక్ర వాహనాల్లో 35 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఈ లక్ష్యం పూర్తికావడంతో ఈవీ పాలసీ అమలు చేసేందుకు పూనుకుంది. ఫిబ్రవరి 10 లేదా ఆ తర్వాత విక్రయించే ద్విచక్ర వాహనాలకు మార్చి 31 వరకు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు చండీగఢ్‌లో పెట్రోల్‌ బైక్‌ల రిజిస్ట్రేషన్‌ నమోదు నిలిపివేస్తున్నట్లు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌ స్పష్టం చేసింది.

ఇక ఏడాది ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారు వేరే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. చత్తీస్‌గఢ్‌లో నాన్-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. ఇలా క్రమక్రమంగా 2024 నాటికి పెట్రోల్‌ ఆధారిత ద్విచక్ర వాహనాలు, ఆటోల రిజిస్ట్రేషన్‌ పూర్తిగా నిలిపివేయనుంది. అలాగే ఈ- బస్‌ల రిజిస్ట్రేషన్లు కూడా వంద శాతం నిలిపివేసేదిశగా అడుగులు వేస్తోంది. 2024 నుంచి రానున్న మూడేళ్లలో ఇంధన ఆధారిత కార్‌ల రిజిస్ట్రేషన్లను కూడా 30, 40, 50 శాతానికి తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే