School Fee: విద్యార్ధికి పక్షవాతం.. స్కూల్ ఫీ కట్టలేదని ఒకటో తరగతి విద్యార్ధిని చితకబాడిన ప్రిన్సిపల్..!
ఫీజు చెల్లించలేదని ఒకటో తరగతి చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన కేసులో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 11) అరెస్ట్ చేశారు..
ఫీజు చెల్లించలేదని ఒకటో తరగతి చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన కేసులో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు శనివారం (ఫిబ్రవరి 11) అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఫీజు కట్టలేదని వేధించి నందుకు
ఉత్తర ప్రదేశ్‌లోని రాస్రా పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఏడేళ్ల అయాజ్ అక్తర్ ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఫీజు చెల్లించనందుకు జనవరి 27న బాలుడు అయాజ్ అక్తర్‌ను క్లాస్‌రూమ్‌లో నాలుగు గంటల పాటు రెండు చేతులూ పైకెత్తించి నిలబెట్టారు. ఈ క్రమంలో టీచర్ చెక్క కర్రతో విచక్షణా రహితంగా కొట్టడం వల్ల బాలుడు స్పృహ కోల్పోయి, పక్షవాతానికి గురయ్యాడు. దీంతో బాలుడిని హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు స్కూల్ యాజమన్యం తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ సత్యేంద్ర పాల్‌తోపాటు, టీచర్ అఫ్సానా, స్కూల్ మేనేజర్ ప్రద్యుమాన్ వర్మపై కూడా కేసు నమోదు చేసినట్లు అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ శుక్లా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.