TS Summer Holidays 2023: తెలంగాణ విద్యార్ధులకు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. ఎప్పట్నుంచంటే..
తెలంగాణ విద్యార్ధులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది (2023) సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు, వేసవి సెలవులకు సంబంధించి విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది..
తెలంగాణ విద్యార్ధులకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది (2023) సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు, వేసవి సెలవులకు సంబంధించి విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెల్పింది. ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, రెండు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇక తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నారు. అందువల్లనే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు వార్షిక పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం..
1 నుంచి 5 తరగతుల విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున ఏప్రిల్ 17తో పరీక్షలుపూర్తవుతాయి. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు జరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడించి, రికార్డుల్లో నమోదు చేయాలని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అనంతరం ఏప్రిల్ 24న స్కూల్స్ లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని సూచించారు. ఇక ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే దాదాపు 48 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలుపుతూ విద్యాశాఖ సూచనలు జారీ చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.