AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Anganwadi Jobs: జీహెచ్‌ఎంసీలో 1500ల అంగన్‌వాడీ పోస్టులకు ఈ నెల్లోనే నోటిఫికేషన్‌..: మంత్రి హరీష్‌

తెలంగాణ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ వర్కర్‌ పోస్టులకు ఈ నెలలో (ఫిబ్రవరి) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం (ఫిబ్రవరి 12) తెలిపారు..

TS Anganwadi Jobs: జీహెచ్‌ఎంసీలో 1500ల అంగన్‌వాడీ పోస్టులకు ఈ నెల్లోనే నోటిఫికేషన్‌..: మంత్రి హరీష్‌
Minister Harish Rao
Srilakshmi C
|

Updated on: Feb 12, 2023 | 11:15 AM

Share

తెలంగాణ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ వర్కర్‌ పోస్టులకు ఈ నెలలో (ఫిబ్రవరి) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం (ఫిబ్రవరి 12) తెలిపారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు ఈ మేరకు సమాధానం ఇస్తూ…

‘బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ప్రారంభించి, అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశాం. ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. వీటిని త్వరలో 134 రకాల పరీక్షలకు పెంచుతాం. 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానలకు సెలవు ఇస్తున్నాం. బస్తి దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉస్మానియాలో 5 లక్షల మంది (60%), గాంధీ 2019లో 3.7 లక్షల మంది (56%), నిలోఫర్ 5.3 లక్షలు (44%), ఫీవర్ ఆసుపత్రిలో లక్ష 12 వేలు (72%) వంటి పెద్దాసుప‌త్రుల్లో ఓపీ త‌గ్గగా, శ‌స్త్ర చికిత్సల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. సీరియ‌స్ పేషెంట్లకు తక్షణ వైద్యం అందించ‌డంపై పెద్దాసుప‌త్రుల్లో సాధ్యం అవుతోంది. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారు. వచ్చే ఏప్రిల్‌ నెలలో అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తాం. అలాగే బస్తీ దవాఖానలో త్వరలో బయోమెట్రిక్ విధానం కూడా ప్రవేశ పెడతామని’ మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.