Brazil Christ The Redeemer: ప్రపంచ ప్రసిద్ద క్రైస్ట్ ది రిడీమర్ జీసస్‌ తలపై కళ్లు చెదిరే పిడుగు.. ‘ఇది దేనికి సూచనో..?’

బ్రెజిల్‌లోని 98 అడుగుల ఎత్తుగల ప్రపంచ ప్రసిద్ధ విగ్రహం అయిన క్రైస్ట్ ది రిడీమర్ గురించి తెలియని వారుండరు. ఫిబ్రవరి 10న ఈ విగ్రహం పిడుగుపాటుకు గురైంది..

Brazil Christ The Redeemer: ప్రపంచ ప్రసిద్ద క్రైస్ట్ ది రిడీమర్ జీసస్‌ తలపై కళ్లు చెదిరే పిడుగు.. 'ఇది దేనికి సూచనో..?'
Brazil Christ The Redeemer
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 12, 2023 | 2:34 PM

సంకల్పితమో.. అసంకల్పితమో.. తెలియదుగానీ అప్పుడప్పుడూ ప్రకృతిలో కొన్ని వింత సంఘటనలు అడపాదడపా అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని ప్రకృతి ప్రేమికులు తమ కెమెరాల్లో బహు జాగ్రత్తగా బంధిస్తుంటారు. వీటిని వీక్షిస్తే ఒకింత ఆశ్చర్యంతోపాటు కెమెరాలకు ఇలాంటివి ఎలా చిక్కుతాయా అనే సందేహం కూడా కలుగుతుంది. అచ్చం అలాంటి సంఘటనే తాజాగా బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని 98 అడుగుల ఎత్తుగల ప్రపంచ ప్రసిద్ధ విగ్రహం అయిన క్రైస్ట్ ది రిడీమర్ గురించి తెలియని వారుండరు. ఫిబ్రవరి 10న ఈ విగ్రహం పిడుగుపాటుకు గురైంది. నేరుగా ఈ విగ్రహం తల మీద పడినట్లు ఉన్న పిడుగు దృశ్యాలను ఎంతో మెలకువతో ఫెర్రాండో అనే వ్యక్తి తన కెమెరాలో బంధించి యావత్‌ ప్రపంచాన్ని మంత్రముగ్దుల్ని చేశాడు.

క్రైస్ట్ ది రిడీమర్‌కు సంబంధించిన పిడుగుపాటు ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో 19 మిలియన్ల వీక్షణలు, లక్షల కామెంట్లు వచ్చాయంటే ఏ మేరకు వైరల్‌ అయ్యిందో ఊహించండి. దేవుడు ఎందుకిలా చేశాడు?, ఇది దేవుడి పనేనని అనుకుంటున్నాను, ఆయన దేవుడైతే ఆ వెలుగు దేవుడిని ఎలా తాకగలుగుతుంది?, ముగింపు దగ్గరలోనే ఉంది.. అంటూ పలువురు ఆధ్యాత్మిక తన్మయత్వంతో కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొందరేమో జోకులు పేల్చుతున్నారు. కాగా బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఉన్న ఈ విగ్రహాన్ని ప్రతి ఏటా దాదాపు రెండు మిలియన్ల మంది సందర్శిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి ఏటా 4 నుంచి 6 సార్లు ఈ విగ్రహం పిడుగుపాటుకు గురౌతుంది. 2014లో పిడుగుపాటు వల్ల విగ్రహం బొటనవేలు దెబ్బతింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తా కథనాల కోసం క్లిక్‌ చేయండి.