Khammam: రోడ్డు యాక్సిడెంట్ కేసులో రూ.కోటి పరిహారం విధించిన ఖమ్మం కోర్టు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాదం కేసులో కోటి రూపాయాల పరిహారం విధిస్తూ కోర్టు శనివారం (ఫిబ్రవరి 11) తీర్పు వెలువరించింది..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రోడ్డు ప్రమాదం కేసులో కోటి రూపాయాల పరిహారం విధిస్తూ కోర్టు శనివారం (ఫిబ్రవరి 11) తీర్పు వెలువరించింది. ఖమ్మం నగరంలో జరిగిన లోక్ అదాలత్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
టాటా ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న గంగుల త్రినాధ్ 2019 మేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీనిపై ఆయన తల్లిదండ్రులు, భార్య ఖమ్మం కోర్టులో భీమా కంపెనీపై కోటి రూపాయలకు కేసు దాఖలు చేశారు. ఈ కేసును శనివారం ఖమ్మం కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో రాజీకి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా శ్రీనివాసరావు ప్రతిపాదించారు. ఇరు పక్షాల వారిని పిలిపించి బీమా కంపెనీతో రాజీ కుదిర్చారు. దీంతో కక్షిదారులకు కోటిరూపాయల పరిహారం అందింది. రోడ్డు ప్రమాదం కేసులో ఇంత పెద్ద మొత్తంలో పరిహారం లభించడం తెలంగాణాలోనే తొలిసారిగా జరిగిందని బీమా కంపెని న్యాయవాది పేర్కొన్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.