Hyderabad Metro: సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలి.. జగ్గారెడ్డి విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే.
హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇదే నేపథ్యంలో మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలనే...
హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇదే నేపథ్యంలో మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలనే ప్రతిపాదనలు వెల్లువెత్తున్నాయి. వీటిలో ప్రధానమైంది. మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మెట్రోను విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో ప్రతిపాదనను తీసుకొచ్చారు.
మియాపూర్ నుంచి మెట్రోను సంగారెడ్డి, సదాశివపేట ఎంఆర్‌ఎఫ్ వరకు విస్తరించాలని కోరారు. జగ్గారెడ్డి ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇదిలా ఉంటే జగ్గారెడ్డి ఇది వరకు కూడా సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణ చేయాలని పలుసార్లు కోరారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోను విస్తరించాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తానని గతంలో తెలిపిన జగ్గారెడ్డి తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఎంఆర్‌ఎఫ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగులు సంగారెడ్డిలోనే ఎక్కువగా ఉంటున్నారని, హైదరాబాద్ దగ్గర కావడంతో ప్రతి రోజూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు సంగారెడ్డి నుంచి వస్తూ వెళ్తుతుంటారని, ఈ నేపథ్యంలో సంగారెడ్డి వరకు మెట్రో సేవలు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని జగ్గారెడ్డి గతలో కోరారు.
మరిన్ని హదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..