Hyderabad E-Motor Show: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును చూశారా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్ల రేంజ్.. మామూలుగా ఉండదు..

మీరు హాలివుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ సినిమాలు చూశారా? అందులో కార్లు అత్యాధునిక సాంకేతికతతో, సూపర్ స్పీడ్ లో దూసుకుపోతుంటాయి. అచ్చం అలాంటి హై స్పీడ్ కారునే హైదరాబాద్ ఈ-మోటార్ షోలో ప్రదర్శించారు.

Hyderabad E-Motor Show: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును చూశారా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్ల రేంజ్.. మామూలుగా ఉండదు..
Battista
Follow us

|

Updated on: Feb 12, 2023 | 2:40 PM

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు జీటీ బటిస్టా( GT Battista) హైదరాబాద్ లో సందడి చేసింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ మోటర్ షో దీనిని ప్రదర్శించారు. దేశంలోనే తొలిసారిగా ఈ మోబిలిటీ వీక్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించారు. ఇది హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈ గ్రాండ్ ప్రిక్స్ కి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఇటలీకి చెందిన లగ్జీరీ కార్ల తయారీ దారు ఆటోమొబిలి పినిన్ ఫరీనా కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ కంపెనీ మన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా, మహీంద్రాకు చెందినది.

హైదరాబాద్ వేదికగా..

హైదరాబాద్ లో ఈ మోటార్ షో ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదో తేదీ వరకూ జరిగింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ఎలక్ట్రిక్ శ్రేణి లో అధునాతన కేతికతతో కూడిన వాహనాలను భారతీయ మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు అనువుగా ఏర్పాటు చేశారు.

ఇలా లాంచ్ చేశారు..

ఈ సూపర్ కారును తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ డైరెక్టర్ సుజయ్ కరంపురి ఇటీవల ఆవిష్కరించారు. మహీంద్రా అండ్ మహీంద్రా యూరప్ బిజినెస్ సీఈవో గురుప్రతాప్ బొపరాయ్, ఆటోమొబిలి పినిన్‌ఫరీనా సీఈవో పాలో డెల్లాచా సమక్షంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరంపురి మాట్లాడుతూ మహీంద్రా గ్రూప్ తో తెలంగాణ ప్రభుత్వానికి మంచి అనుబంధం ఉందని, ఎలక్ట్రిక్ వేరింయట్లో ఇటువంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన కారును ఇండియాలో ప్రప్రథమంగా ఇక్కడ ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోపరాయి మాట్లాడుతూ బాటిస్టా కారు ఎలక్ట్రిక్ వాహనాల్లోనే అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగించి తయారు చేశామన్నారు. ఫార్ములా ఈ సర్క్యూట్ లో దీనిని నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..