Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra electric car: టాటా నెక్సాన్‌‌కి పోటీగా మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్.. లుక్ మామూలుగా లేదుగా.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..

టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా బీఈ.05, బీఈ.05 రాల్ ఈ( BE.05 and BE.05 RALL E) కార్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Mahindra electric car: టాటా నెక్సాన్‌‌కి పోటీగా మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్.. లుక్ మామూలుగా లేదుగా.. మార్కెట్లోకి ఎప్పటి నుంచి అంటే..
Mahindra Rall E
Follow us
Madhu

|

Updated on: Feb 12, 2023 | 2:20 PM

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆటో మోబైల్ కంపెనీలు విద్యుత్ శ్రేణిలోకి మారాల్సిన అనివార్యత కనిపిస్తోంది. ఒక వైపు మండిపోతున్న ఇంధన ధరలు.. మరోవైపు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా కర్భన ఉద్ఘారాలను తగ్గించాలని అన్ని ప్రభుత్వాలు సూచిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరికీ కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం విద్యుత్ వాహనాలు. అందుకే అన్ని కంపెనీలు విరివిగా ఈ శ్రేణిలో వాహనాలు తయారు చేస్తున్నాయి. మన దేశంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇప్పుడు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రకటించింది. వీలైనంత త్వరగా దీనిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. టాటా నెక్సాన్ ఈవీ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా బీఈ.05, బీఈ.05 రాల్ ఈ( BE.05 and BE.05 RALL E) కార్లను తీసుకురానున్నట్లు వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వోక్స్‌వ్యాగన్ సహకారంతో..

ఎక్స్‌యూవీ బీఈ.05 కారు ఇటీవల మహీంద్రా ప్రకటించిన మూడు ఎస్‌యూవీ కార్లలో ఒకటి. ఇది వరకూ దీనికి సంబంధించిన బేసిక్ లుక్ ని కంపెనీ రివీల్ చేసింది. దీనిలో వోక్స్‌వ్యాగన్ అభివృద్ధి చేసిన కొత్త ఇన్‌గ్లో(INGLO) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇది కేవలం బోర్న్ ఎలక్ట్రిక్ వేరియంట్ గా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది భారతీయ మార్కెట్లో మొదటి ఎస్‌యూవీ మోడల్ కారు. దీని ఉత్పత్తిని డిసెంబర్ 2024లో ప్రారంభించి 2025 లో మార్కెట్లో ఆవిష్కరిస్తామని ఆ కంపెనీ పేర్కొంది.

ఫీచర్లు ఇలా..

ఈ కారు ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వంటి పూర్తి వివరాలు మహీంద్రా వెల్లడించలేదు. వోక్స్‌వ్యాగన్, మహీంద్రా కలిసి అభివృద్ధి చేయబడిన ఇన్ గ్లో ప్లాట్‌ఫారమ్, వోక్స్‌వ్యాగన్ ఎంఈబీ ప్లాట్‌ఫారమ్‌తో పాటు అనేక భాగాలను ఈకారు పంచుకుంటుంది. ఇది చుట్టూ తేలికైన స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ ఉంటుంది. అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలను ఈకారులో అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సవాళ్లకు సిద్ధం..

ఈ కొత్త-యుగం వాహనం.. భవిష్యత్తులో మరింత అప్ గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని, అవసరమైనప్పుడు కొత్త సాంకేతికతలను జోడించవచ్చని తయారీదారులు ప్రకటించారు. దీనిలో ఆగ్మెంటెడ్-ఎనేబుల్డ్ హెడ్స్-అప్ డిస్‌ప్లే, 5G నెట్‌వర్క్ సామర్థ్యం, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. క్యాబిన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్‌లను పొందుతుంది.