Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి.. లేకపోతే దరిద్రం తిష్ట వేసుకున్నట్లే..!

జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలంటే, ఇంటికి వాస్తు ఉండడంతోపాటు.. ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను..

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి.. లేకపోతే దరిద్రం తిష్ట వేసుకున్నట్లే..!
Vastu Tips
Follow us

|

Updated on: Feb 16, 2023 | 4:22 PM

కొందరు తమ ఇంటిని బాలా గొప్పగా, వైభవోపేతంగా నిర్మించుకుంటారు. కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు. ఏదో తెలియని అలజడి, నెగటీవ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీలవుతుంటారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు కూడా శరామాములే అన్నట్లుగా మారిపోతుంది పరిస్థితి. అందుకు వారి ఇంటిలోని వాస్తు దోషాలే కారణమని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటిని ఎంత గొప్పగా కట్టినా.. వాస్తు దోషాలు ఉంటే సమస్యలు, ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలంటే, ఇంటికి వాస్తు ఉండడంతోపాటు.. ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. ఇంట్లో ఉండే అనేక వస్తువులు మన జీవితం‌పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. అవి ఉన్న ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటుందని వారు అంటున్నారు. మరి కుటుంబంలోని ప్రశాంతతను, వాస్తును ప్రభావితం చేసే ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు: ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలా మంది తరచుగా ఇండోర్ మొక్కలను నాటుతారు. అయితే ఇంట్లో ఉంచకూడని మొక్కలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవి పెరిగే కొద్దీ అందులో ముళ్లు పెరగడం ప్రారంభిస్తాయి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ, జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచినట్లయితే, ఈ రోజు వాటిని తీసేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
  2. పాత న్యూస్‌ పేపర్లు: చాలా ఇళ్లలో పాత వార్తాపత్రికలు ఉండటాన్ని మీరు తరచుగా చూసి ఉంటారు. ఇంట్లో ఈ వస్తువులు ఉండటం ఎంత అశుభమో తెలుసా..? పాత వార్తాపత్రికలపై ఉండే దుమ్ము, ధూళి కారణంగా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని ఈ నెగెటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. పురోభివృద్ధి కుంటుపడి కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
  3. తుప్పు పట్టిన తాళం: పాడైపోయిన తాళాలు, తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వారు చెబుతున్నారు. ఇక ఈ తాళాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని అంటున్నారు. పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని, ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. కనుక ఇంట్లో పాడైపోయిన పాత తాళాలను తీసి వేయడం మంచిది.
  4. పాత, పనిచేయని గడియారాలు: ఇంట్లో కదలని, పనిచేయని పాత గడియారాలు ఉంచుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పనిచేయని గడియారాలు జీవితంలో అవరోధాలను సృష్టిస్తాయి. జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి. అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని గడియారాలు, వాచ్‌లను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. విరిగిపోయిన బొమ్మలు, దేవతల పాత విగ్రహాలు: పాత లేదా విరిగిన విగ్రహాలు, దేవతల పాత చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఇంటికి నెగిటివిటీని తెస్తాయి. కాబట్టి పాత విగ్రహాలు, పెయింటింగ్స్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సకాలంలో వాటిని తొలగించాలి.

వాస్తుపై ప్రతికూల ప్రభావాలను చూపే ఈ ఐదు వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయట పడేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని, కుటుంబ సమస్యలు దూరమవుతాయిన వాస్తు శాస్త నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు
ఇంటర్వ్యూల్లో అస్సలు సెలక్ట్‌ అవ్వడం లేదా.? ఈ వాస్తు లోపాలు
అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా అతి
అప్పుడు ధోని.. ఇప్పుడు కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా అతి
ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా..? ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది
ఈ అమ్మాయి ఆ స్టార్ హీరోయినా..? ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది
అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..
అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..
వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం..
వృషభ రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి ఆర్థిక స్థిరత్వం..
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో
గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో