AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: అబ్బాయిల్లోని ఈ గుణాలంటే అమ్మాయిలకు అసహ్యం.. అవేమిటో తెలుసుకోకపోతే అంతే సంగతీ..!

తాము ప్రేమించిన అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకా వారు చేయని పనంటూ ఉండదు. వారితో స్నేహ సంబంధం ఏర్పరుచుకోవాలన్నా..

Relationship Tips: అబ్బాయిల్లోని ఈ గుణాలంటే అమ్మాయిలకు అసహ్యం.. అవేమిటో తెలుసుకోకపోతే అంతే సంగతీ..!
చట్నీ ఎలా తయారు చేయాలి: ముందుగా ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటోలను గ్యాస్‌పై వేయించి, ఆ తర్వాత పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ మిక్సీ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసి, గిన్నెలో సర్వ్ చేయాలి. దీనిని అన్నం-పప్పు లేదా రోటీతో తినవచ్చు.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 15, 2023 | 8:25 PM

Share

తాము ప్రేమించిన అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంకా వారు చేయని పనంటూ ఉండదు. వారితో స్నేహ సంబంధం ఏర్పరుచుకోవాలన్నా, వారి ప్రేమను పొందాలన్నా చాలా కష్టపడిపోతుంటారు అబ్బాయిలు. అంతేనా.. వారికి నచ్చిన వేషాలన్నీ కూడా వేస్తుంటారు. కానీ అమ్మాయిను ఇంప్రెస్ చేయడం అంత తేలికైన పనేతే కాదుగా. ఈ విషయం బహుశా అబ్బాయిలకు తెలియకపోవచ్చు. అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆమెకు నచ్చేవి ఎన్ని చేసినా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే గ్యారెంటీ లేదని సీనియర్ లవర్స్ చెబుతున్నారు. అలాగే మీరు ఆమె కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా మిస్ ఫైర్ అయ్యాయంటే.. ఇక మీ పని గోవిందా అని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రేమ కాదు కదా కనీసం స్నేహం కూడా దక్కుదని కూడా అంటున్నారు.

అయితే చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిల్లో కొన్ని నచ్చని గుణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుని వాటిని మానుకుంటేనే అమ్మాయిలతో ప్రేమైనా.. స్నేహమైనా సాధ్యం. ఇంకా అమ్మాయిలను కూడా తేలికగా ఇంప్రెస్ చేయవచ్చు. మరి అమ్మాయిలకు నచ్చని ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చని లక్షణాలు..

  • అమ్మాయిలపై చెత్త జోకులు వేయడం: చాలా మంది అబ్బాయిలు తమ స్నేహితురాలిని ఇంప్రెస్ చేసే క్రమంలో ఇతర అమ్మాయిలపై పిచ్చి పిచ్చి జోకులు వేస్తుంటారు. కొన్ని సార్లు చనువుగా, సరదాగా ఆ అమ్మాయిని కూడా ఎగతాళి చేస్తూ జోకులు వేస్తుంటారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేసే విషయంలో ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్లను అమ్మాయిలు అస్సలే ఇష్టపడరు. ముఖ్యంగా బాడీ షేమింగ్ చేసే ఏ అబ్బాయిని కూడా అమ్మాయి ఇష్టపడదు.
  • తామే గ్రేట్ అని ఫీలవడం: తమకు తాము గ్రేట్ అని ఫీలయ్యే అబ్బాయిలకు అమ్మాయిలు చాలా దూరంగా ఉంటారు. అలాంటి అబ్బాయిలు దగ్గర వచ్చే ప్రయత్నం చేసినా దూరంగా పెడుతుంటారు. తమను తాము ఉన్నత వ్యక్తులుగా భావించుకునే వాళ్లు అమ్మాయిలను చులకన చేసి చూస్తుంటారని వారి భావన. అందుకే ఇలాంటి వారికి గర్ల్స్ దూరంగా ఉంటారు.
  • ఉపన్యాసాలు ఇవ్వడం: తరచుగా ఉపన్యాసాలు ఇచ్చే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు తెగ చిరాకు. ప్రతీ చిన్న విషయానికి లెక్చర్లు ఇస్తుంటే ‘ఏంట్రా ఈ నస’ అని ఫీలవుతుంటారు. అబ్బాయిలు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే దూరంగా వెళ్లిపోతుంటారు. కనీసం వాళ్లు మాట్లాడుతుంటే కూడా ఇష్టపడరు. అంతేకాక అలాంటి అబ్బాయిలను చూడగానే పారిపోతుంటారు.
  • ఆధిపత్యం చూపడం: ఆధిపత్యం, డామినేషన్ చేసే అబ్బాయిలు అంటే కూడా అమ్మాయిలకు అసహ్యం. అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడుతూ, చులకనగా చూస్తూ తాము ఆధిపత్యం చలాయిస్తుంటారు కొందరు అబ్బాయిలు. ‘నీవు అమ్మాయివి, నీకు ఏం తెలుసం’టూ తరచుగా చెబుతుంటారు ఇలాంటి వారు. అన్ని విషయాలు తమకే తెలుసని ఫీలవుతూ.. అమ్మాయిలను మాట్లాడనివ్వరు. అందుకే ఇలాంటి అబ్బాయిలు అంటే అమ్మాయిలకు నచ్చరు.

పైన చెప్పిన అంశాల్లో ఏ ఒక్క గుణం మీకు ఉన్నా.. వెంటనే మార్చుకోవాలని సీనియర్ లవర్స్ సూచిస్తున్నారు. లేదంటే మీకు మీ పార్టనర్ దొరకడం కష్టం. అందులోనూ మీరు కావాలనుకునే అమ్మాయిని దక్కించుకోవాలంటే మరింత కష్టం. ఒకవేళ వేరే అమ్మాయితో పెళ్లి జరిగినా.. వాళ్లు కూడా మిమ్మల్ని ఎక్కువగా భరించలేరంటూ హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Follow Us