AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Side Effects: ఉప్పుతోనే ఆరోగ్య సమస్యలు..? పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

ఎన్ని పదార్ధాలు వేసిన వంటల్లో సరిగ్గా ఉప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్ట్ వేరు. అందుకే వంటల్లో ఉప్పు అంత ప్రాధాన్యత.. కానీ..

Salt Side Effects: ఉప్పుతోనే ఆరోగ్య సమస్యలు..? పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..
Salt
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 15, 2023 | 5:12 PM

Share

భారతీయ వంటలకు రుచిని అందించడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఏవైనా ఉన్నాయంటే అవి ఉప్పు, కారమే. ఈ రెండు లేకపోతే ఏ ఆహారం అయినా రుచిలేనిదే అవుతుంది. ముఖ్యంగా ఉప్పు లేకుండా ఏ వంటకాన్ని అయినా ఊహించుకోవడం చాలా కష్టం.. ఎన్ని పదార్ధాలు వేసిన వంటల్లో సరిగ్గా ఉప్పు వేస్తే ఆ వంటకు వచ్చే టేస్ట్ వేరు. అందుకే వంటల్లో ఉప్పు అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అతిగా ఉప్పు వాడటం కూడా ప్రమాదమేనని, అలా తినడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయం తెలియక చాలా మంది ఉప్పును అతిగా తింటారని అంటున్నారు. మరి అతిగా ఉప్పు వాడటం వలన కలిగే అనర్ధాలు ఏమిటో.. నిపుణుల హెచ్చరికలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతంది. ఇలా సోడియం స్థాయి ఎక్కువగా ఉంటే.. రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. తరచు మూత్రం వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మహిళలు, వయస్సు పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
  2.  ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు శరీర అవయావలలోని కణాలకు శక్తి సరఫరా తక్కువగా ఉంటుంది.
  3. ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్రం వస్తుంది.
  4. ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు, గుండె సమస్యలు, పక్షవాతం వచ్చే ప్రమాదం అధికమవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల జీవక్రియ, శక్తి సమతుల్యత దెబ్బతింటుంది.
  7. ఉప్పు మన కణాల పవర్ ప్లాంట్స్ అయిన మైటోకాండ్రియాని పనిచేయకుండా చేస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది.
  8. ఎక్కువ ఉప్పు తినడం వల్ల శరీరంలో నీరు నిలుపుదల అవుతుంది. దీని ఫలితంగా ఉబ్బరం, వాపు సమస్యలు ఏర్పడుతాయి.
  9. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. లైంగిక జీవితాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది.
  10. మితిమీరిన ఉప్పు మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. కాలక్రమేణా కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది.నిద్రలేమి సమస్యలు ఏర్పడుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..