Corona Face Masks: మాస్క్‌లు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదా? చావు కబురు చల్లగా చెప్పిన పరిశోధకులు
ఇప్పటికీ కరోనా భయం ప్రజలను వీడలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా నుంచి రక్షణకు మాస్క్‌లు ధరించాలని చెప్పడంతో ఇంకా వాడేవారు చాలా మంది ఉన్నారు. మాస్క్ అనేది మానవ జీవితంలో మస్ట్‌గా మారింది.
కోవిడ్-19 అంటే వాడుక భాషలో కరోనా. కరోనా మానవాళిని ఎంత భయపెట్టిందో అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచాన్నే కరోనా ఓ కుదుపు కుదిపేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో దాని నుంచి వైద్యులు సూచించిన మార్గం ఒక్కటే. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్క్ ధరించాలని చెప్పారు. మాస్క్ ఎంత ప్రభావం చూపించింది అంటే మాస్క్ పెట్టుకోపోతే కరోనా వచ్చేస్తుందనే భయం చాలా మందిని వెంటాడింది. ఇప్పటికీ కరోనా భయం ప్రజలను వీడలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా నుంచి రక్షణకు మాస్క్‌లు ధరించాలని చెప్పడంతో ఇంకా వాడేవారు చాలా మంది ఉన్నారు. మాస్క్ అనేది మానవ జీవితంలో మస్ట్‌గా మారింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. మాస్క్ ధరించడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందలేమంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ముఖ్యంగా ఎన్ 95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌లు ధరించడం వల్ల ఫ్లూ నుంచి రక్షణ పొందలేమని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మొదట మాస్క్‌లు పెట్టుకోవడం అవసరం లేదంటూ పేర్కొన్నా ఏప్రిల్ 2020లో మాత్రం మాస్క్ వేరింగి మస్ట్ అంటూ తెలిపింది. సెప్టెంబర్‌లో సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ మాస్క్‌ల మాత్రమే కరోనా నుంచి రక్షిస్తాయని పేర్కొనడంతో అన్ని దేశాలు పౌరులు తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. అనంతరం మాస్క్‌లు పెట్టుకోవడం తప్పనిసరైంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి 12 మంది పరిశోధకుల నేతృత్వంలోని బృందం కోవిడ్-19ను ఆపడానికి మాస్కింగ్ ఏం చేయలేదని తేల్చింది. దాదాపు 78 నియంత్రిత ట్రయల్స్‌ను పరిశోధకుల బృందం పరిశీలించింది. ముఖ్యంగా మాస్, నాన్ మాస్క్‌ల మధ్య ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించారు. ఎన్ 95, సర్జికల్ మాస్క్‌లను ధరించడం వల్ల ఫ్లూ కలిగిన వ్యక్తుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాకపోగా వారి నుంచి ఇతరులకు కూడా ఎలాంటి హానీ కలగలేదని వెల్లడైంది. ముఖ్యంగా శ్వాస కోశ అనారోగ్యం కారణంగానే అన్ని పరిస్థితులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కరోనాకు ముందు దాని తర్వాత ఫ్లూ ఇన్‌ఫెక్షన్ గురించి స్టడీ చేసినా ఇదే విషయం వెల్లడైందని పేర్కొన్నారు. అయితే మరికొన్ని నివేదికల ప్రకారం కోవిడ్ సమయంలో మంచిదైందని ముఖ్యంగా ఇండోర్ ప్రదేశాల్లో కోవిడ్ వ్యాప్తిని మాస్క్‌లు సమర్థవంతంగా కట్టడి చేశాయని పేర్కొంటున్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి