Hyderabad: ఫైన్ పడకూడదని ఇలా నంబర్ ప్లేట్‌కి మాస్క్ పెడుతున్నారా.. అయితే డైరెక్ట్ జైలుకే

ఫైన్ పడకుండా నంబర్ ప్లేట్‌కు మాస్క్ పెట్టి మీరు స్మార్ట్ అనుకోకండి. ఒక్కసారి గానీ అలా పోలీసులకు చిక్కారా వాళ్లు ఎంత హార్డో చూపిస్తారు.

Hyderabad: ఫైన్ పడకూడదని ఇలా నంబర్ ప్లేట్‌కి మాస్క్ పెడుతున్నారా.. అయితే డైరెక్ట్ జైలుకే
Mask To Bike Number Plate ( Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2023 | 8:05 AM

మొహానికి పెట్టుకోవాల్సిన మాస్క్‌ స్కూటర్‌ నంబర్‌ ప్లేట్‌కి పెట్టుకుని ట్రాఫిక్‌ పోలీసులకు మస్కా కొట్టాలనుకున్నాడో ప్రబుద్ధుడు. విషయం పసిగట్టిన పోలీసులు సదరు వాహనదారుడిని అదుపులోకి తీసుకొని కేసు పెట్టారు. దీంతో మనుషుల మొహానికి పెట్టుకోవాల్సిన మాస్క్… నెంబర్ ప్లేట్ కి పెట్టి ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆ యువకుడికి 8 రోజులు జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు.

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. నెంబర్ ప్లేట్ కనిపించకుండా పెట్టుకొని వాహనం నడుపుతున్న బాలాపూర్ క్యూబా కాలనీ కి చెందిన సయ్యద్‌ షోయబ్ అక్తర్ అలీ ని అదుపులోకి తీసుకున్నారు రెయిన్ బజార్ పోలీసులు. నిందితుడిని నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా మెజిస్ట్రేట్ 8రోజులు జైలు శిక్ష విధించారు. రెయిన్ బజార్ పోలీసులు షోయబ్‌ని చంచల్ గూడా జైలుకి తరలించారు.

Traffic Violation

ట్రాఫిక్ వైలేషన్స్ చేసే వాహనదారులు ఫోటోలను తీసి పోలీసులు ఫైన్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బైక్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఆ నంబర్ ఆధారంగానే ఫైన్ పంపుతారు. దీంతో పోలీసులకు చిక్కకుండా దూసుకెళ్లేందుకు ఆ యువకుడు ఈ ప్లాన్ చేశాడు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. మాములుగా అయితే ఫైన్స్‌తో పోయేది.. ఇలా చేసి ఇప్పుడు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మీరు జాగ్రత్త సుమీ..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..