Cashback Offer: క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించిన పేమెంట్స్ యాప్.. యూపీఐ లావాదేవీలు చేస్తే లాభాలే.. త్వరపడండి..

పేటీఎం వినియోగదారులకు శుభవార్త. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందిస్తోంది ఈ పేమెంట్‌ సంస్థ. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు..

Cashback Offer: క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించిన పేమెంట్స్ యాప్.. యూపీఐ లావాదేవీలు చేస్తే లాభాలే.. త్వరపడండి..
Paytm Cashback Offer
Follow us

|

Updated on: Feb 15, 2023 | 6:59 PM

పేటీఎం వినియోగదారులకు శుభవార్త. పేటీఎం ద్వారా చెల్లింపులు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందిస్తోంది ఈ పేమెంట్‌ సంస్థ. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు ఏకంగా 14000 క్యాష్‌బ్యాక్ పాయింట్లను పొందవచ్చు. ఇక పేటీఎం.. తన వినియోగదారుల కోసం ఈ బంపర్ ఆఫర్‌ను ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమయింది. ఈ మేరకు పేటీఎం సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ కూడా చేసింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా పేటీఎం ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో పేటీఎం తెలిపిన వివరాల ప్రకారం.. పేటీఎం చెల్లింపులు చేయడం ద్వారా  మూడు చొప్పున మూడు రకాల కార్డులను అందుతాయి. లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, డిన్నర్ కార్డ్ పేరుతో ఉన్న ఈ తొమ్మిది కార్డ్‌లను సేకరించిన తర్వాత, వినియోగదారులు రూ. 140 విలువైన 14,000 పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్‌లను పొందుతారు.

అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఈ నెల 14 నుంచి 20 వరకు.. అంటే వారం రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కార్డ్‌లను పొందాలంటే పేటీఎంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా వినియోగదారులు డబ్బులు స్వీకరించినా, డబ్బును బదిలీ చేసినా, మొబైల్‌ రీఛార్జ్,  యుటిలిటీ బిల్లులు చెల్లించినప్పుడు పాయింట్లను సంపాదించవచ్చు.  ఈ సంగతి దాదాపుగా అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి

పేటీఎం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌‌ను ఎలా పొందాలంటే..

  • Paytm యాప్ ద్వారా ఏదైనా పేమెంట్‌ చేయండి.
  • పేమెంట్‌ తర్వాత పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌పై క్లిక్‌ చేయండి.
  • క్రిందికి స్క్రోల్ చేసి, 14వేల క్యాష్‌బ్యాక్ పాయింట్ల బ్యానర్‌లో ప్లే అండ్‌  విన్‌పై క్లిక్ చేయండి.
  • ఇలా వచ్చిన మొత్తం 9 తొమ్మిది కార్డ్‌లను స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది.
  • వినియోగదారులు స్నేహితుల నుంచి అదనపు కార్డ్‌ను కూడా తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు.
  • అన్‌లాక్ చేయకుంటే స్క్రాచ్ కార్డ్‌లు వచ్చిన 3 రోజుల తర్వాత పనికిరావు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..